ఈక్విటీ డెలివరీ అంటే ఏమిటి?

పరిచయం

ఈక్విటీ డెలివరీ లేదా డెలివరీ ఆధారిత ట్రేడింగ్ మీరు షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయగల మార్గాల్లో ఒకటి. ఈక్విటీ డెలివరీలో, మీరు కొన్ని షేర్లను కొనుగోలు చేస్తారు మరియు మీ డిమాట్ అకౌంట్లో కొంత సమయం పాటు వాటిని ఉంచుకోవచ్చు. డెలివరీ ట్రేడింగ్లో, మీకు పంపిణీ చేయబడిన తర్వాత, మీరు కావలసినంత కాలం షేర్లను ఉంచుకోవచ్చు. మీరు కొనుగోలు చేసిన స్టాక్స్ యొక్క పూర్తి యాజమాన్యం కలిగి ఉంటారు, మరియు వాటిని మంచి లాభం వద్ద అమ్మడానికి అవకాశం వచ్చేవరకు వేచి ఉండవచ్చు. ఇది ఇతర రకాల ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ కు విరుద్ధం, ఇక్కడ మీరు ఒకే ట్రేడింగ్ రోజులో షేర్లను కొనుగోలు చేసి విక్రయిస్తారు. మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో షేర్స్ యొక్క పూర్తి ధరను చెల్లించవలసిన అవసరం లేదు. మరోవైపు, డెలివరీలో షేర్లను కొనుగోలు చేయడానికి, మీకు మీ ఖాతాలో తగినంత నిధులు అవసరం, ఎందుకంటే మార్జిన్లు అందించబడవు.

ఈక్విటీ డెలివరీ అంటే ఏమిటో మనం చూసాము కాబట్టి; ఇప్పుడు మీ లాభాలను గరిష్టంగా పెంచే కొన్ని పెట్టుబడి చిట్కాలను చూద్దాం

మిక్స్ మరియు మ్యాచ్– ‘మీ గుడ్లు అన్నింటినీ ఒకే బాస్కెట్లో పెట్టకండిఅనేది షేర్ల కోసం కూడా వర్తిస్తుంది. మీ డబ్బును ఒకే షేర్లో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి. మీరు షేర్లు కొనుగోలు చేస్తున్నప్పుడు, మిక్స్డ్ బ్యాగ్ నిర్మించడం ఎల్లప్పుడూ లక్ష్యం గా పెట్టుకోండి. మీరు మీ పరిశోధనను చేసిన తరువాతే వివిధ రంగాల నుండి వేర్వేరు కంపెనీల కోసం వెళ్ళాలి. మీకు బాగా అభివృథి చెందుతాయి అని అనిపించే ప్రాంతాలు కొన్ని షార్ట్ లిస్ట్ చేయండి ఆ తరువాత ఆ ప్రాంతాలలో ట్రేడింగ్ అయ్యే కంపెనీలు ఎంచుకోండి.  వివిధ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనం కల్పిస్తుంది ఎందుకంటే రంగాలలో ఏదైనా మంచి వార్తలు ఉన్నట్లయితే, అది మీ కోసం లాభాలను నిర్ధారిస్తుంది.

సహనంతో ఉండండిషేర్ మార్కెట్ అనేది చాలా అస్థిరమైనది, కాబట్టి, ఇది మీ సహనాన్ని క్రమం తప్పకుండా పరీక్షిస్తుంది. మీరు కొనుగోలు చేసే షేర్లు కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అన్ని షేర్ల ధరలు క్రమానుగతంగా పైకి కిందకి కదులుతూ ఉంటాయి. మీరు తగ్గుతూ ఉండే ధరలను చూసి, ఏదో చెడ్డ జరగబోతుంది అని అనుకోని మీ షేర్లను విక్రయించకండి. ఇంట్రాడే ట్రేడింగ్ పై డెలివరీఆధారిత ట్రేడింగ్ ఆఫర్ల యొక్క భారీ ప్రయోజనం ఏంటంటే మీరు మీ షేర్లను విక్రయించవలసిన స్థిర వ్యవధి ఏదీ లేదు. మీరు శాంతిగా ఉంటే ఇది లాభం పొందే అవకాశాలను పెంచుతుంది. చాలామంది వ్యాపారులు వారి ఖర్చు ధరకు షేర్లు చేరుకునేవరకు వేచి ఉంటారు, తరువాత విక్రయిస్తారు.

ఈక్విటీ డెలివరీ యొక్క ప్రయోజనాలు

డెలివరీ ఆధారిత ట్రేడింగ్ చాలా ప్రయోజనాలను అందిస్తుంది

ఇందులో ఎలాంటి సమయం లేనందున, మార్కెట్ చెడుగా ఉన్నప్పుడు మీరు షేర్లను ఉంచుకోవచ్చు మరియు మీకు సరిపోయే ధరలు ఉన్నప్పుడు మాత్రమే అమ్మవచ్చు.

కొన్ని బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థలు మీ షేర్ల ఆధారంగా లోన్లు ఇస్తాయి. కాబట్టి, మీరు కష్టమైన సమయంలో వెళ్తున్నప్పుడు, మీ షేర్లు మీకు అందుబాటులో వస్తాయి.

ఒక కంపెనీ లాభం పొందుతోందని మీరు చూస్తే, ఆ కంపెనీ ఒక షేర్ కు ఒక డివిడెండ్ ప్రకటించవచ్చు. అప్పుడు, కంపెనీల షేర్లను కలిగి ఉండటం వలన మీకు ప్రతి షేర్ పై డివిడెండ్లు లభించును.

మీరు మీ డబ్బును బ్యాంకులో ఉంచినప్పుడు, మీరు గరిష్టంగా 9% లేదా 10% వార్షిక వడ్డీని పొందుతారు. అయితే, మీరు పెరుగుతున్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి డబ్బును పెట్టినట్లయితే, మీరు కనీసం 15% నుండి ప్రారంభమయ్యే రాబడులు పొందవచ్చు. కొన్ని షేర్లు మీకు సంవత్సరంలో 30 నుండి 40% వరకు రాబడులు కూడా ఇస్తాయి. మీరు దీర్ఘకాలిక ట్రేడ్ చేసినప్పుడు ఉత్తమ షేర్ మార్కెట్ లాభాలు పొందవచ్చును.

ఒకవేళ ఒక కంపెనీ పెద్ద లాభం పొందితే, అది బోనస్ షేర్లను ప్రకటించవచ్చు. వారు 1:1 ప్రకటించినట్లయితే, మీ వద్ద ఉన్న షేర్లకు ఒక షేర్కు ఒక షేర్ ఉచితంగా పొందవచ్చు అని అర్థం.

ముగింపు

మీరు ఎల్లప్పుడూ మీరు కొనుగోలు చేయాలని ప్రణాళిక చేస్తున్న కంపెనీలలోకి పరిశోధనను చేయాలి. ధరలు వారి సరసమైన ధర కంటే తక్కువగా ఉన్నప్పుడు షేర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. విధంగా, మీరు లాభాలు చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని తెలుసుకోవడం ఇంట్రాడే ట్రేడర్లు మరియు డెలివరీ ట్రేడర్లు ఇద్దరకు ఉపయోగపడే నైపుణ్యం.

ఈక్విటీ డెలివరీ ఛార్జీలు ఏమిటో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు షేర్లలో ట్రేడ్ చేసేటప్పుడు సర్వీస్ టాక్స్, స్టాంప్ డ్యూటీ, డిపాజిటరీ పార్టిసిపంట్ ఛార్జీలు వంటి అనేక రకాల చార్జీలు వర్తిస్తాయి.