అగ్రో కమోడిటీలలో ట్రేడింగ్: బిగినర్స్ గైడ్

1 min read
by Angel One

స్టాక్స్‌లో కొన్ని సంవత్సరాలు వాణిజ్యం చేసిన తరువాత, శ్రీకాంత్ తన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను కొన్నింటిని నెరవేర్చడానికి దగ్గరగా వచ్చాడు. కానీ, ఒక రిటైర్మెంట్ కార్పస్ సృష్టించడం కోసం అతను తన పోర్ట్ఫోలియోను మరింత విభిన్నంగా చేయాలనుకున్నాడు. అతను కమోడిటీ ట్రేడింగ్ గురించి విని ఉన్నాడు, కానీ పెట్టుబడి పెట్టడానికి సంకోచించాడు. అప్పుడు ఒక రోజు, అతను తన స్నేహితుడు రాకేష్ ని కలుసుకున్నాడు, వ్యవసాయ వస్తువులలో పెట్టుబడి పెట్టడానికి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ను ఉపయోగించవచ్చని అతను వివరించాడు.

ప్రాథమిక అంశాలను వివరిస్తూ, రాకేష్ ఇలా చెప్పాడు, “ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ను హెడ్జింగ్ మరియు ఊహించడం కోసం ఉపయోగించవచ్చు. ఒక పెట్టుబడిదారునిగా, మీరు ఒక నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తి ధర గురించి ఊహించడానికి మార్కెట్‌ను పరిశోధించవచ్చు. మార్కెట్ పుంజుకుంటోందని మీకు నమ్మకం ఉంటే, మార్జిన్ మొత్తాన్ని మాత్రం చెల్లించి, ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనుగోలు చేయండి.” కమోడిటీ ట్రేడింగ్‌లో ఫ్యూచర్స్ అనేది చాలా ప్రయోజనాన్ని చేకూర్చగలదని, మరియు జాగ్రత్తగా ట్రేడింగ్ అతని పెట్టుబడి లక్ష్యాలను నెరవేర్చడానికి అనుమతించగలదని శ్రీకాంత్ త్వరగా గ్రహించాడు.

వస్తువులను అర్థం చేసుకోవడం:

ఒక వస్తువు అనేది ఏదైనా అవసరమైన ఉత్పత్తి; వ్యవసాయపరమైన లేదా వ్యవసాయపరమైనది కానిది, ఇది మార్పిడి చేయబడవచ్చు లేదా వాణిజ్యం చేయబడవచ్చు. భారతదేశంలో, వస్తువులు రెండు వర్గాలుగా విభజించబడతాయి: మృదువైన వస్తువులు మరియు కఠినమైన వస్తువులు. మృదువైన వస్తువులలో చక్కెర, గోధుమ, సోయాబీన్, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి, సాధారణంగా కఠినమైన వస్తువులు గనులనుంచి తీయబడినవి అయి ఉంటాయి. ఉదాహరణకు, ఖనిజాలు, నూనె మొదలైనవి కఠినమైన వస్తువుల వర్గంలోకి వస్తాయి. 

భారతదేశంలో కమోడిటీ ట్రేడింగ్:

ప్రధానంగా వ్యవసాయపరమైన ఒక ఆర్థిక వ్యవస్థగా ఉండటం వలన, వ్యవసాయ వస్తువులను వర్తకం చేయడానికి భారతదేశంలో తగినంత అవకాశం ఉంది. భారతదేశంలో వ్యాపార వస్తువు ట్రేడింగ్ ప్రారంభం అనేది 1875 లో బాంబేలో కాటన్ ట్రేడ్ అసోసియేషన్ స్థాపించబడటం నుండి ఉందని తెలుసుకోవచ్చు. దేశీయ వినియోగం కోసం వస్తువుల కొరత కారణంగా వస్తువులలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది 1952 నుండి నిలిపివేయబడింది. 2002 నుండి మళ్ళీ కమోడిటీ ట్రేడింగ్  సిఫార్సు చేయబడింది. ప్రస్తుతం, వ్యవసాయ వస్తువులలో వాణిజ్యంలో మొత్తం వస్తువుల వర్తకంలో దాదాపుగా 12% ఉంటుంది. 

భారతదేశంలో కమోడిటీ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‍లు:

మీరు వస్తువుల వర్తకం చేయవచ్చు – పశు సంపద మరియు మాంసం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు మరియు శక్తిని దేశంలోని ఆరు కమోడిటీ ఎక్స్ఛేంజ్ లలో:

– మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసిఎక్స్)

– జాతీయ కమోడిటీ మరియు డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్‍సిడిఇఎక్స్)

– జాతీయ మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎంసిఇ)

– ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఐసిఇఎక్స్)

– ఏస్ డెరివేటివ్స్ అండ్ కమోడిటీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఏసిఇఎక్స్)

– యూనివర్సల్ కమోడిటీ ఎక్స్చేంజ్ (యుసిఎక్స్)

ఈ కమోడిటీ ఎక్స్ఛేంజ్‍లలో, ఎన్‌సిడిఇఎక్స్ మరియు ఎన్‌సిఎంఇ ప్రథానంగా వ్యవసాయ వస్తువులపై దృష్టి కేంద్రీకరిస్తాయి.

 వస్తువుల ట్రేడింగ్ కోసం రెగ్యులేటర్:

భారతదేశంలో ట్రేడింగ్ మార్కెట్ వస్తువుల కోసం ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అందించడానికి ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ (ఎఫ్‌ఎంసి) 1950 ల మొదట్లో ఏర్పాటు చేయబడింది. మార్కెట్ కోసం యూనివర్సల్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్‍ను అందించడానికి సెప్టెంబర్ 2015 లోఇది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తో విలీనం చేయబడింది. తరువాత, వస్తువుల వర్తకంలో ఆప్షన్స్ కాంట్రాక్ట్  ప్రవేశపెట్టడం, కమోడిటీ డెరివేటివ్‍లలో డీల్/ పాల్గొనడానికి స్టాక్ బ్రోకర్లను మరియు కొన్ని వర్గాల విదేశీ సంస్థ పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) ను అనుమతించడం, తమ వాణిజ్య వేదికలపై కమోడిటీ డెరివేటివ్‍లను ప్రవేశపెట్టడానికి ఎన్ఎస్ఇ మరియు బిఎస్ఇను అనుమతించడం వంటి అనేక చర్యల ద్వారా కమోడిటీ మార్కెట్ యొక్క కార్యాచరణ పనితీరును ఎస్ఇబిఐ మెరుగుపరిచింది.

వ్యవసాయ వస్తువులలో వ్యాపారాన్ని అర్థం చేసుకోవడం:

మీరు ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ద్వారా వ్యవసాయ వస్తువులలో వర్తకం చేయడం ప్రారంభించవచ్చు. ఇది ఒక భవిష్యత్ తేదీన ముందుగా నిర్ణయించబడిన ధరఖు ఒక ప్రత్యేక వ్యవసాయ వస్తువు యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక ఒప్పందం. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్‍లు)  మరియు ఎక్స్చేంజ్ ట్రేడ్ నోట్స్ (ఇటిఎన్‍లు) ద్వారా వ్యవసాయ వస్తువుల హెచ్చుతగ్గులలో కూడా మీరు పాల్గొనవచ్చు.

వ్యవసాయ వస్తువులలో వర్తకం చేయడం వలన ప్రయోజనాలు:

– భవిష్యత్తు మరియు స్పాట్ ధరల మధ్య ఒక లింక్ గా పనిచేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను స్థిరపరచడానికి కమోడిటీ ట్రేడింగ్ సహాయపడుతుంది. భవిష్యత్తు మరియు స్పాట్ ధరలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి, మరియు అనుకోని ధర హెచ్చుతగ్గులతో ముడిపడి ఉండే ప్రమాదాలను తగ్గించడానికి హెడ్జింగ్ సహాయపడగలదు. ధరల యొక్క సీజనల్ హెచ్చుతగ్గులు తక్కువగా ఉన్నప్పటికీ, స్థిరమైన ధరల కారణంగా రైతులు/నిర్మాతలు ప్రయోజనం పొందుతారు.

– వ్యవసాయ ఉత్పత్తులలో కమోడిటీ ట్రేడింగ్ సమర్థవంతమైన హెడ్జింగ్ మరియు ఊహాజనిత వ్యూహాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఇప్పటికే ఉన్న స్పాట్ ధరల కారణంగా, భవిష్యత్తు ధరల్లో చెప్పుకోదగిన మార్పు ఉంటే, ఒక సమర్థవంతమైన హెడ్జింగ్ వ్యూహం చేయబడవచ్చు. మరోవైపు, భవిష్యత్తు ధరలో మార్పులు ఇప్పటికే ఉన్న స్పాట్ ధరలను ప్రభావితం చేస్తే, ఒక సమర్థవంతమైన ఊహాజనిత వ్యూహం రూపొందించబడవచ్చు. ఆ విధంగా, మార్కెట్లో ప్రస్తుత ధోరణుల ఆధారంగా, భవిష్యత్తు ధరలను కనుగొనడానికి ఇది అనుమతిస్తుంది.

– వ్యవసాయ వస్తువులలో వర్తకం చేయడం వ్యవసాయ ఉత్పత్తుల ఖచ్చితమైన, మార్కెట్-ఆధారిత ధరకు చేరుకోవడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు, ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) మరియు రైతుల ద్వారా నిర్ణయించబడే హోల్‌సేల్ ధరలు ఇప్పటికే ఉన్న మార్కెట్ ప్యాటర్న్‌లతో సమన్వయం కలిగి ఉండవు కాబట్టి, ఇది కీలక ప్రాధాన్యత కలిగినది.

– రిటైల్ మరియు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఇద్దరి కోసం, వ్యవసాయ వస్తువులలో వర్తకం అనేది వారి పోర్ట్ఫోలియోలను విభిన్నంగా చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. వస్తువులలో వర్తకం అనేది సాంప్రదాయక స్టాకులు మరియు సెక్యూరిటీలలో వర్తకం చేసినంత సులభంగా మారింది. మీరు చేయవలసిందల్లా ఒక  డిమ్యాట్ అకౌంట్ మరియు ఒక ట్రేడింగ్ అకౌంట్ తెరవడం, మరియు అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయడం మాత్రమే. వ్యవసాయ వస్తువులలో మీ పెట్టుబడులను ఎక్కువగా చేసుకోవడానికి, సీజనల్ మరియు వాతావరణం సంబంధిత వేరియబుల్స్ తో పాటు సరఫరా మరియు డిమాండ్-ఆధారిత కారకాలను పరిగణనలోకి తీసుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.

భారతదేశంలో వర్తకం చేయబడే అగ్ర వ్యవసాయ వస్తువుల జాబితా:

కమోడిటీ   ఎక్స్ఛేంజ్‍ల వ్యాప్తంగా వర్తకం చేయబడుతున్న 29 వ్యవసాయ-ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. అగ్రశ్రేణి ఉత్పత్తుల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

  1. మసాలా దినుసులు మరియు సాస్‍లు
  2. పత్తి మరియు ఫైబర్
  3. బీర్ పదార్థాలు
  4. ఆపిల్స్ మరియు ద్రాక్ష వంటి తాజా పండ్లు
  5. పప్పు దినుసులు మరియు బీన్స్ వంటి పప్పులు
  6. చక్కెర కన్ఫెక్షనరీ, చూయింగ్ గమ్, చాక్లెట్లు మరియు బిస్కెట్లు వంటి స్నాక్స్
  7. తృణధాన్యాలు
  8. బాదం లాంటి నట్స్
  9. వివిధ రకాల మసాలాలు

 ఒక కమోడిటీ బ్రోకర్‌ను ఎలా సమీపించాలి?

వ్యవసాయ వస్తువులలో వర్తకం చేయడానికి సరైన స్టాక్ బ్రోకర్‌ను ఎంచుకోవడం ముఖ్యమైనది. ఎల్లప్పుడూ అనేక కమోడిటీ ఎక్స్ఛేంజ్‍ల వ్యాప్తంగా వర్తకం చేయడానికి ఆటంకాలు లేని వేదికలను అందించగల స్టాక్ బ్రోకర్‍ను మీరు సమీపించాలి అనే విషయం మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వస్తువులలో వాణిజ్యం చేసేటప్పుడు అవగాహనాపూర్వక నిర్ణయాలు తీసుకోవడానికి తాజా పరిశోధనా నివేదికలకు ప్రాప్యత పొందడం అనేది మీకు వీలు కల్పిస్తుంది. మీరు దేశంలోని అత్యంత నమ్మదగిన మరియు విశ్వసనీయమైన స్టాక్ బ్రోకర్లలో ఏంజెల్ బ్రోకింగ్ ను పరిగణించవచ్చు, ఇది సున్నా ఎఎంసి తో ఉచిత ఆన్‍లైన్ డిమ్యాట్ అకౌంట్ అందిస్తుంది. ప్రాథమిక నివేదిక, సాంకేతిక నివేదిక మరియు ప్రత్యేక నివేదిక వంటి వివిధ లోతైన నివేదికలకు మీరు ప్రాప్యత పొందుతారు. అంతేకాకుండా, ఆన్‍లైన్ ఎన్‍సిడిఇఎక్స్ మరియు ఎంసిఎక్స్ మార్జిన్ క్యాలిక్యులేటర్ మీకు సరైన ట్రేడింగ్ మార్జిన్ ని నిర్ధారించడానికి సహాయపడగలదు.