What is After Market Offer?

Podcast Duration: 7:16
ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ ​మిత్రులారా! ఈవినింగ్ స్కూల్స్, ఈవినింగ్ కాలేజెస్ గురించి మీరు వినే ఉంటారనుకుంటాను? ఈమధ్యనే నెట్ఫ్లిక్స్ లో నైట్ స్కూల్ అన్న పేరుతో ఒక కామెడీ చిత్రం వచ్చింది. మీరు చూశారా? ఈవినింగ్ కాలేజ్, నైట్ స్కూల్ – ఇలా ఏ పేరుతో పిలిచినా – పని చేస్తూ చదువుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. ఒకవైపు చదువుకుంటూ డబ్బు సంపాదించాలనుకునే యువత కావచ్చు లేదా పెద్ద వయసులో కూడా చవుకోవాలని, డిగ్రీలు సంపాదించాలని ఉత్సాహపడే పెద్దవారు కావచ్చు. దీని ఉద్దేశం ఉద్యోగాలు చేసుకుంటూనే వారు డిగ్రీలు కూడా సంపాదిస్తారన్న మాట. ​ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ కూడా దాదాపు ఇలాంటిదే – ఇది బ్రోకరేజ్ కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు ఇచ్చే ఒక చక్కటి సేవ. దీన్నే ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్ లేదా AMO అని కూడా అంటారు. మీలాంటి, నా లాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం. మనం ఆఫీసుకు వెళ్తే అప్పుడప్పుడు మంచి నీళ్ళు తాగడానికి కూడా సమయం ఉండదు, లంచ్ చేసేది 4 గంటలకే ... ఈ ఉరుకులు పరుగుల పనితో పాటు ట్రేడింగ్ చెయ్యాలంటే మనలాంటి వారికి వీలయ్యే పనేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది ఇంకా ఇబ్బందికరం. తమ సిబ్బంది ఆఫీసు సమయంలో 100% పనితీరు చూపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. మరి ఇటువంటి పరిస్థితుల్లో ట్రేడింగ్ కోసం కనీసం ఒక్క గంట కేటాయించాలన్నా అసాధ్యంగా అనిపిస్తుంది. ​మనలాంటి వాళ్ళ కోసమే ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్. ​సరే, అదేంటో తెలుసుకుందాం రండి! ​ఈ కోర్సులో ప్రాధమిక అంశం గురించి తెలుసుకుందా – ​అదే – ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ అంటే ఏమిటి? ​ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ అంటే, యాక్చువల్ ట్రేడింగ్ అవర్స్ తర్వాత కూడా ట్రేడ్ చేసే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు కల్పించడం. అంటే 9.15 - 3.30 తర్వాత అన్నమాట. ఈ‌ సర్వీస్ అమెచూర్ ఇన్వెస్టర్లకు మరియు పార్ట్ టైమ్ ట్రేడర్స్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారు తమ ఉద్యోగం చేసుకుంటూ, మరోవైపు ట్రేడ్ చేసుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ వచ్చేక ఈ ఆఫ్టర్ మార్కెట్ సేవ అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా ఆఫర్ మార్కెట్ ఆఫర్ ఉపయోగించి ట్రేడ్ చెయ్యాలనుకుంటే, వారికి తపనిసరిగా ఆన్ లైన్ ఉండాలి. ​ ​ఈ ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ ట్రేడింగ్ అన్నది SEBI అనుమతించిన ప్రక్రియ. ​ఇక ఇప్పుడు ఈ ఆకాఫ్టర్ మార్కెట్ ఆఫర్ ను ఉపయోగించడం వల్ల లాభాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది, మీరు మీ ఉద్యోగం ఫ్చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకోవచ్చు. రిస్క్ తగ్గించడం కొరకు చాలా మండి ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ ను తమ వృత్తిగా చేపట్టరు. వారు ఒక వైపు స్థిరమైన ఆదాయాన్ని పొందుతూనే, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లేదా డే-ట్రేడింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారికి ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ​ఇక రెండవ లాభం – ఇది కొంతమేరకు కాంప్లికేషన్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మరుసటి ఉదయం వరకు స్టాక్స్ ధరలు స్టాటిక్ గా ఉంటాయి. అమెచూర్ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ అటూ కదలాడే స్టాక్ మార్కెట్ సూచీనీ చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ వల్ల ఈ ఇబ్బంది తప్పింది. ఎందుకంటే, స్టాక్స్ ధరలు మరుసటి రోజువరకు కదలిక లేకుండా ఉండిపోతాయి. కాబట్టి మీరు చక్కగా రీసర్చ్ చేసి మీకు కావలసిన స్టాక్ ను ఎంపిక చేసుకోవచ్చు. మీరు రీసెర్చ్ చేస్తున్న సమయంలో దాని ధరలో మార్పు ఏమీ రాదు. ఇందులో మీకు మార్జిన్ ట్రేడింగ్ సౌకర్యం కూడా ఉంది. మార్జిన్ ట్రేడింగ్ అంటే మీరు ట్రేడర్ తాను కొనుగోలు చేసిన స్టాక్స్ కు సంబంధించి కొంత మొత్తం మాత్రమే డబ్బు చెల్లిస్తాడు. ​ఆఫ్టర్ మార్కెట్ వల్ల లభించే 4వ లాభం ఫ్లేక్జిబిలిటీ. మీకు 5% విగ్గిల్ రూమ్ లభిస్తుంది - అంటే ఆరోజు స్టాక్ క్లోస్ అయిన ధరపైన 5% ఎక్కువ లేదా 5% శాతం తక్కువ కు మీరు ట్రేడ్ చెయ్యవచ్చు. ఉదాహరణకు ఒక స్టాక్ 100 రూపాయల దగ్గర క్లోజ్ అయిందనుకుంటే, మీరు 95 రూపాయలకు బై చెయ్య వచ్చు లేదా 105 రూపాయలకు సెల్ చెయ్యవచ్చు. విగ్గిల్, విగ్గిల్, విగ్గిల్ మిత్రమా. మీరు దీనికి కంటే ఎక్కువ పోవడానికి వీలు లేదు. మీ ఆర్డర్ రేటు మరుసటి రోజు స్టాక్ యొక్కఓపనింగ్ రేట్ కు మ్యాచ్ అయితే, మీకు ఆ ధర వచ్చేస్తుంది. ​ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ ద్వారా లభించే 5 వ లాభం - విదేశీ ఇన్వెస్టర్లకు కూడా ఇది అవకాశాలను అందిస్తుంది. ఆలోచించండి - యుఎస్ మనకంటే 10 గంటలు వెనకబడి ఉంటుంది. ఒకవేళ అమెరికాకు చెందిన వ్య్హక్తి ఎవరైనా ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చెయ్యాలంటే అతను రాత్రంతా మేల్కొని ఉంది ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. కానీ దీని వల్ల అతను అక్కడ సాధారణ జీవితం గడుపుతూనే, అక్కడ తెల్లవారిన తర్వాత ట్రేడింగ్ చెయ్యవచ్చు ​ ​ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ ద్వారా లభించే 6 వ లాభం ఏంటంటే మీరు డౌన్ ట్రెండ్ ప్రీడిక్షన్ కంటే ముందే సెల్ చేసుకోగలరు. ఉదాహరణకు మీరు హోల్డ్ చేసిన స్టాక్ స్టాక్ ప్రైస్ లో లాంగ్ దేక్లైన ఉన్నట్లు మీ రీసర్చ్ లో వెల్లడైందనుకోండి దాన్ని మీరు ఈరోజు ట్రేడింగ్ పూర్తయిన తర్వాత అమ్మకానికి పెట్టవచ్చు అది రేపు ఉదయం ధర తగ్గే లోపు అమ్ముడు పోతుంది. ఈవిధంగా మీరు మాష్టాల నుండి తప్పించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదూ!! మరయితే అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం: ​ఎక్కడికి వెళ్ళాలి: మీకు ఏంజిల్ బ్రోకింగ్ లో ఒక డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఉందని అనుకుందాం, ఇప్పుడు మీరు చెయ్యల్సింది ఏమిటంటే, ట్రేడింగ్ అవర్స్ తర్వాత మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. ​సమయం: ట్రేడింగ్ మ్లోజ్ అయ్యేక సాయంత్రం 3.45 నుండి మరుసటి రోజు 8.57 వరకు మీరు ఎప్పుడైనా ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ లో ట్రేడ్ చెయ్యవచ్చు. ​ఒకవిషయం మిగిలిపోయింది – గమనించావా మిత్రమా? మనం లాభాల గురించి మాట్లాడుకున్నాం, మరి పరిమితుల సంగతి ఏమిటి? స్టాక్ మార్కెట్ మాటల్లో చెప్పాలంటే ప్రతి దానికి బొమ్మతో పాటు బోరుసూ ఉంటుంది. ఈ బోరుసు గురించి ఎవరైనా మీకు చెప్పకపోతే మీరు వారిని నమ్మకండి. అందరూ మా లాగా నమ్మకంగా, ఓపన్ గా ఉండరు కదా. ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ లో పరిమితుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ​మీరు కొంటున్నపుడు లేదా అమ్ముతున్నపుడు స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అవనంత మాత్రాన మీకు రిస్క్ పూర్తిగా తొలిగిపోయిందని కాదు. కాకపోతే దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ తక్కువగా ఉంటుంది, స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. కానీ తప్పుడు ఎంపిక తప్పుడు ఎంపికనే అవుతుంది కదా. అందువల్ల మీరు హిట్ బటన్ నొక్కడానికి ముందు - ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న కంపెనీల గురించి బాగా రీసర్చ్ చేయండి. ఆ కంపెనీ అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ​మరో విషయం – ఆఫ్టర్ మార్కెట్ ఆఫర్ ట్రేడింగ్ లో స్టాప్ లాస్ ఆప్షన్ ఉండదు. స్టాప్ లాస్ మిమ్మల్ని నష్టాల్లోకి పోకుండా ఎలా కాపాడుతుందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. స్టాప్ లాస్ లేకుండా మీరు మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారంటే, బ్యాట్ మ్యాన్ సినిమాలో బనే తాడు లేకుండా దూకేసినట్లే ఉంటుంది. ​గుర్తుంచుకో మిత్రమా – ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు, మీ వయసు గానీ, మీరు చేస్తున్న పని గానీ దేనికి ఏమాత్రం అడ్డు కాదు. మీ ట్రేడింగ్ జర్నీ ని ఈవాళే ప్రారంభించండి. మీ ఇన్వెస్టింగ్ నాలెడ్జ్ ను ఇంప్రూవ్ చేసుకోండి. ఏంజిల్ బ్రోకింగ్ వెబ్ సైట్ లో మరియు యూ ట్యూబ్ చానల్ లో లభించే నిపుణుల సలహాలు తీసుకోండి, ఇతర ఉచిత ఫైనాన్షియల్ ఎజుకేషన్ వనరులను ఉపయోగించుకోండి. ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి.. ​