Exploring the differences between OFS and IPO!

Podcast Duration: 6:57
ఓఎఫ్ఎస్ మరియు ఐపీఓ మధ్య తేడాలు అన్వేషించడం! ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​మిత్రులారా, OFS మరియు IPOలు రెండు ఒకదానికి ఒకటి చాలా దగ్గరి సంబంధం కలిగిన అమ్చాలే అయినప్పటికీ, వీటిలో కొన్ని ప్రధానమైన తేడాలు ఉంటాయి. ఈరోజు మనం ఈ తేడాలతో పాటు OFS-IPO మధ్య ఉన్న సిమిలారిటీస్ గురించి కూడా తెలుసుకుందాం. ​IPO ఆంటీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అర్థం. OFS అంటే, ఆఫర్ ఫర్ సేల్ అని అర్థం. ఆఫర్ ఫర్ సేల్ అన్నది కూడా నిజనైకి ఒక రకమైన IPO నే. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రజలుకొనుగోలు చేయడానికి కొత్త షేర్లను. మార్కెట్లో ఉంచుతారు. ​IPO కోసం వెళ్ళే కంపెనీలు మరియు OFS కోసం వెళ్ళే రకం కంపెనీలు కూడా చాలా భిన్నంగా ఉండవచ్చు. పబ్లిక్ ఆఫర్‌ను కలిగి ఉండటానికి కారణాలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రారంభ పబ్లిక్ ఇష్యూలో - పేరు సూచించినట్లుగా - మీరు సాధారణంగా ఇంతకు ముందు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయని కంపెనీని చూస్తారు. వీటి విషయంలో హిస్టారికల్ ప్రైస్ ను చూసే అవకాశమే లేదు, ఎందుకంటే వీటి విషయంలో గత చరిత్ర అన్నదే ఉండదు. ఈ ఆఫర్ ఫర్ సేల్ జారీ చేసే కంపెనీలు కేవలం కొన్ని రుజులుగా మాత్రమే వ్యాపారంలోకి ఎంటర్ అయి ఉంటాయి – ఈ కంపెనీల పాత షేర్ హోల్డర్లు (వీరినే యాంకర్ షేర్ హోల్డర్స్ అని పిలుస్తారు) వారికి వస్తున్న సంపాదనతో సంతోశంగా ఉంటారు. వేరే ఆకవశాలు వస్తే వారిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. OFS మినిమమ్ షేర్ హోల్డర్స్ నిబంధనలను కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది. నిజానికి ఈ OFS లను SEBI 2012 లోనే ప్రవేశ పెట్టింది. లిస్టింగ్ కావాలనుకునే కంపెనీలు తమ షేర్లల్లో 25% పబ్లిక్ హోల్డింగ్ కలిగి ఉండాలి. ​ఈ కంపెనీలకు చెందిన కొన్ని షేర్లు సాధారణంగా అప్పటికే షేర్ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి OFSకు వెళ్ళే కంపెనీల స్టాక్ ప్రైస్ మనకు తెలిసే ఉంటుంది.అలాంటి IPOలలో ఒకటి 2020 లో విడుదలైన బర్గర్ కింగ్ IPO. ​ఒక్క విషయం మిత్రమా! స్టాక్ మార్కెట్ యొక్క ప్రతి పర్పోజిషన్ లోనూ రిస్క్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయం మరువ కూడదు. కాకపోతే : ​IPO గురించి ఇన్వెస్టర్లు ఎందుకంత ఆతృతగా ఉంటారంటే, అందులో షేర్లు తక్కువ ధరకు వస్తాయనే ఆశ. వాస్తవానికి ఇలాగే జరగాలి, కానీ దానికి గ్యారంటీ లేదు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఇన్వెస్టర్ చెల్లించిన ధరకు ఆ షేర్లు వస్తాయో లేదో చెప్పడానికి వీలు ఉండదు. ఏ IPO విషయంలో అయినా OFS ల విషయంలో అయినా ఇదే జరుగుతుంది. OFS లో వస్తున్న ఈ షేర్లు గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ లో ఉంటాయి కాబట్టి వాటి పనితీరు గురించి ఇన్వ్గెస్టర్ అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ​IPOకు వెళ్ళే కంపెనీ ఏ సైజులో అయినా ఉండవచ్చు అయితే OFS కు వెల్ల కంపెనీ మాత్రం లార్జ్ మరియు వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయి ఉండాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో ఆ కంపెనీ గత నాలుగు క్వార్టర్లలో టాప్ 200 కంపెనీలలో ఒకటై ఉండాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో ఉన్న షేర్లు లేదా పబ్లిక్ దగ్గర ఉన్న షేర్లు అని అర్థం. లార్జ్ క్యాప్ కంపెనీలను స్టాక్ మార్కెట్ నిపుణులు సాధారణంగా లెస్ రిస్కీ కంపెనీలుగా పేర్కొనడం జరుగుతుంది. అందువల్ల IPO మరియు OFSల మధ్య పోలిక చూస్తే OFS లు కొంత మేరకు లెస్ రిస్కీ ఇన్వెస్ట్ మెంట్ ప్రోపొజిషన్ గా పేర్కొనవచ్చు. ఇక ఎవాల్యువేషన్ విషయంలో చూసినా IPO మరియు OFS మధ్య తేడా ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాల బట్టి ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది ​ఏదైనా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు – ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేముందు – మీరు ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలి. IPO విషయం అయితే ఇది తప్పకుండా చెయ్యాలి, ఎందుకంటే వీటి విషయంలో స్టాక్ ప్రైస్ ఉండదు కాబట్టి. దీనికి ఒకటే క్రైటీరియా ఉంది అదే – ఆ కంపెనీ యొక్క ఆస్తి-అప్పుల పట్టికను పరిశీలించడం. IPO అయినా OFS అయినా దరఖాస్తు ప్రక్రియ మాత్రం ఒకేవిధంగా ఉంటుంది. రీటైలర్ ఇన్వెస్టర్లు చేసే దరఖాస్తును “బిడ్” గా పిలుస్తారు. ఈ రెండు సందర్భాల లోనూ మీరు మీ బిడ్ ప్రైస్ ను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది – అది స్పెసిఫిక్ ప్రైస్ కావచ్చు లేదా కటాఫ్ ప్రైస్ కావచ్చు – ఇది డిమాండ్ సప్లై లెక్కల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ​కానీ ఓవరాల్ ప్రొసీజర్ విషయానికి వస్తే, చాలా మండి ఇన్వెస్టర్లు OFSల పట్లనే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఎందుకంటే వీటిలో బిడ్ చేసిన మరుసటి రోజే అలాట్ మెంట్ జరిగిపోతుంది గనుక. అలాట్ మెంట్ దొరకని ఇన్వెస్టర్ల డబ్బు కూడా మరుసటి రోజే తిరిగి చెల్లించడం జరుగుతుంది. “OFS ప్రొసీజర్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది” అన్న మాటలు కూడా మీరు వింటూనే ఉంటారు. ఈ సెంటిమెంట్ ఎందుకొచ్చిందంటే దీనికి సంబంధించిన సమాచారం ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉందుండి – క్యూములేటివ్ బిడ్ అమౌంట్స్ మరియు ఇండికేటివ్ ప్రైసెస్ త్రూ ఔట్ ద ట్రేడింగ్ డే అందుబాటులో ఉంటాయి. అదే IPOల్లో అయితే కంపెనీ ప్రాస్పెక్టస్ లో లభించే సమాచారం ఆధారంగా మాత్రమే మనం బిడ్ పైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ​ఇన్వెస్టర్లకు OFSలో నచ్చేది వేగవంతమైన టర్న్ అరౌండ్ – IPOల్లో అయితే అది 3 – 4 రోజులు ఉంటుంది. ఆదే OFSల్లో అయితే కేవలం ఒకే 1 రోజులో అయిపోతుంది. రీఫండ్ కూడా వెంటనే లభిస్తుంది. ​ఇప్పుడు మనం చార్జెస్ గురించి మాట్లాడుకుందాం. IPOల్లో అయితే మీరు ఎలాంటి చార్జెస్ లేదా ఫీజులు చెల్లించవలసిన అవసరం ఉండదు. కానీ మీరు FOS ద్వారా ఒక స్టాక్ కోనాలంటే, మీరు బ్రోకరేజ్ ఫీజు తో పాటు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. ​అన్నింటికంటే ఎక్కువ ఆకర్షణీయమైన అంశం, వీటిల్లో లభించే డిస్కౌంట్లు. ఔనంది, మీరు విన్నది నిజమే – అన్నీ FOS ల్లో రీటైల్ ఇన్వెస్టర్లకు సెల్లర్లు డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. కాకపోతే అది కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుందనుకోండి. ఎందుకంటే ఈ డిస్కౌంట్ వివరాలను అప్ ఫ్రంట్ స్టాక్ ఎక్స్చెంజెస్ లో సమర్పించవలసి ఉంటుంది. ​టైమింగ్ అన్నది స్టాక్ మార్కెట్ లో అతి ముఖ్యమైన అంశం. అందు వల్ల దీనిగురించి చర్చించడం మనం మరిచిపోకూడదు. IPOల కోసం మీరు మార్కెట్ అవర్స్ తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ OFSల కోసం మీరు ట్రేడింగ్ సమయంలో మాత్రమే మీరు మీ బిడ్ ను సమర్పించవలసి ఉంటుంది. ​ ​ఇక ఇన్వెస్ట్ మెంట్ యొక్క అప్పర్ లిమిట్ IPO లో అయినా OFSలో అయినా 2 లక్షల రూపాయలే. ​ ​కాబట్టి మిత్రమా, మీరు IPO లో పెట్టుబడి పెట్టాలన్న లేదా OFS లో పెట్టాలన్నా లేదా ఇప్పటికే మార్కెట్ లో ఉన్న కంపెనీల స్టాక్స్ కొనాలన్నా లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ పొందాలన్నా, మీరు మీ సొంత రీసర్చ్ చేసి, మొదటి అడుగు వెయ్యవలసి ఉంటుంది. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఏ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా సరే పూర్తిగా తెలుసుకోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పటికీ రిస్క్ మీ వెంటే ఉంటుంది. దాన్ని మినిమైజ్ చెయ్యడానికి అనేక మార్గాలు ఉన్నాయి – వారిని మీరు తప్పకుండా అవలంభించాలి. భయం వద్దు కానీ తొందరపాటు కూడా వద్దు. వయసుతో, మీరు చేస్తున్న పనితో సంబంధం లేకుండా ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి.. ​