Exploring the Differences between futures and option trading

Podcast Duration: 5:03
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మధ్య తేడాలు అన్వేషించడం మిత్రులారా, ఏంజెల్ బ్రోకింగ్ యొక్క ఈ పోడ్కాస్ట్ కు స్వాగతం. మిత్రులారా, స్టాక్ మార్కెట్లో అనేక మంది స్టాక్స్ కొని అమ్ముతారు. మీరు స్టాక్‌ను కొన్నపుడు లేదా అమ్మినప్పుడు, ఈ షేర్లు మీ డీమాట్ ఖాతాకు జమ చేయబడతాయి. - లేదా తిరిగి అమ్మబడినప్పుడు డబ్బు మీ డీమాట్ ఖాతాకు జమ అవుతుంది. అయితే స్టాక్ మార్కెట్లో ఇవి మాత్రమే జరగవు. స్టాక్ లేదా వస్తువుల ధరల స్థితిగతులను గుర్తించడం, భవిష్యత్తులో స్టాక్ ఉంచడం చేసే మొత్తం ప్రపంచమే స్టాక్ మార్కెట్లో ఉంది. ఇదంతా ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ మార్కెట్లలో జరుగుతుంది. బాగుంది, కదా? నేను నా స్నేహితుడు అక్షయ్‌తో ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ మధ్య కొన్ని తేడాలను చర్చిస్తున్నాను, కానీ హిమాన్షుకు ఈ విషయాలు సరిగ్గా అర్థం కావడంలేదు. ఎందుకంటే ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ మధ్య గందరగోళంలో ఉన్నాడు. మీరు ఎవరూ హిమాన్షు వలె గందరగోళంలో లేరు కదా! పదండి ఒకసారి వీటిని రివ్యూ చేసేద్దాం. సాధారణంగా, ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ రెండూ కాంట్రాక్టులు. ఒకటి ఫ్యూచర్ కాంట్రాక్టు ద్వారా నిర్ధిష్ట ఫ్యూచర్ ధరకు ఏదైనా స్టాక్ లేదా XYZ కార్పోరేషన్ కమోడిటీ లేదా బంగారం, క్రూడ్ ఆయిల్ కొనవచ్చు, అమ్మవచ్చు. అయితే నేను XYZ స్టాక్ ధర 30 రోజులలో పతనమవుతుందని ఉహిస్తాను, అపుడు నా అంచనా ఆధారంగా లాభం పొందడానికి ఒక ఫ్యూచర్ కాంట్రాక్టును కొంటాను, దాని ద్వారా నేను మార్కెట్లో స్టాక్ ను 30 రోజులలో తక్కువ ధరకు కొనగలుగుతాను. నా ఫ్యూచర్ కాంట్రాక్టును ఉపయోగించి ఎక్కున ధరకు అమ్మగలుగుతాను. అయితే మీరు గుర్తించవలసినది ఫ్యూచర్ కాంట్రాక్టు నుండి బయటకు రాలేరు. ఒకవేళ మీ ప్రస్తుత సెక్యూరిటీ మెత్తం విలువ కోల్పోతే మీకు 100% నష్టం కలుగవచ్చు. అందువలన ఫ్యూచర్ కాంట్రాక్టుల విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ ఆప్షన్ కాంట్రాక్టు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. ఆప్షన్స్ అంటే తరువాత ఏదైనా రోజున కొనడానికి, అమ్మడానికి గల ఆప్షన్. ఆప్షన్స్ కంట్రాక్టులో కూడా ఒక స్ట్రైక్ ప్రైస్ సూచించబడుతుంది. ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ ఎంచుకుంటే భవిష్యత్తులో ఒక నిర్ధిష్ట ధరకు స్టాక్ కొనగలుగుతారు. పుట్ ఆప్షన్ ద్వారా భవిష్యత్తులో ఒక నిర్ధిష్ట ధరకు స్టాక్ అమ్మగలుగుతారు, సులువుగా ఉంది కదా? దానితో ఆప్షన్స్ లేదా ఫ్యూచర్ రెండు కాంట్రాక్టులలో కూడా కొనడానికే ప్రీమియంలు చెల్లించాలని మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ మీ కాంట్రాక్టు యొక్క సెక్యూరిటీ ఊహించిన విధంగా నడిచినా, లేదా ప్రీమియం విలువ కన్నా తగ్గినా మీకు లాభం రాకపోవచ్చు, లేదా కొంచం నష్టం కలుగవచ్చు. అందువలన, ఆప్షన్స్ లేదా ఫ్యూచర్ కాంట్రాక్టులను బలమైన విశ్లేషణ, వాస్తవాల ఆధారంగా చేయాలి కానీ ఊహలు, పుకార్లపై ఆధఆరపడి కాదు. నిజానికి, భవిష్యత్తు మరియు ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి ప్రవేశించడానికి నా స్నేహితుడు అక్షయ్ నా సలహా కోరాడు. నేను అతనికి ఇదే చెప్పాను. ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ మధ్య ముఖ్యమైన తేడాలను చూద్దాం పదండి. మొదటిది - ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ లలో ముఖ్యమైన వ్యత్యాసం తప్పనిసరిగా చర్య తీసుకోవాలనే నియమం. ఫ్యూచర్ కాంట్రాక్టుల విషయంలో ట్రేడ్ మీకు లాభదాయకంగా ఉన్నా, నష్టదాయకంగా ఉన్నా ఫ్యూచర్ కాంట్రాక్టుల నిబంధనలను ఒక నిర్దిష్ట తేదీన అమలు చేయాలి, ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాల్సిన నియమం ఉండదు. రెండవది - ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ లు మీ పోర్ట్‌ఫోలియో లేదా స్థానాలకు తెచ్చే ప్రమాదం చాలా భిన్నంగా ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్లు, ఫ్యూచర్ కాంట్రాక్టుల వలన మీ ట్రేడ్ మొత్తంపై 100 శాతం అపాయం కలుగవచ్చు. మీరు ఎంత మొత్తానైనా కోల్పోతారు. ఆప్షన్స్ విషయంలో ఆప్షన్స్ కొనడానికి మీరు చెల్లించే ప్రీమియం కోల్పోయే అవకాశం ఎక్కువ. మిత్రులారా మీకు ఈ విషయం అర్థమయ్యిందా? ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో రిస్క్ ను పరిగణించడం చాలా ముఖ్యం. ఇక తరవాతి తేడా చూద్దాం. మూడవది- ఫ్యూచర్ కాంట్రాక్టుల విలువ గడువు తేదీలు సమీపించినా క్షీణించవు - ఒక ఫ్యూచర్ కాంట్రాక్టు గడువు నేటి నుండి రెండు వారాలు ఉంటే, గడువు తేదీ దగ్గరకు వచ్చినా దాని విలువను కోల్పోదు, కానీ గడువు తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆప్షన్స్ విలువ తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుత మరియు గడువు తేదీ మధ్య సెక్యూరిటీ విలువ మారడానికి మిగిలిన కాలపరిమితి తగ్గుతూ ఉంటుంది. నాల్గవది - ఫ్యూచర్ కాంట్రాక్టులు ప్రాథమికంగా మార్జిన్ ట్రేడ్స్ ను పోలి ఉంటాయి. ఎందుకంటే సెక్యూరిటీ యొక్క ధర మీరు ఆశించిన దిశకు వ్యతిరేకంగా నడవవలసి వస్తే, రోజు చివరిలో మీరు ఆ మార్జిన్‌ను మీ బ్రోకర్‌కు చెల్లించాలి. కానీ ఒకవేళ మీ విశ్లేషణ సరైతే, మరియు సెక్యూరిటీ ధర మీరు ఊహించిన దిశలో నడిస్తే, ఆ యొత్తం మీ ఖాతాలో జమ అవుతాయి. కానీ ఆప్షన్స్ ను ఉపయోగించి మీరు తక్కువ ధరను ఊహించవచ్చు. అంటే ఆప్షన్స్ కాంట్రాక్టులలో రిస్క్ మరియు రివార్డులు ఒకేవిధంగా ఉండవు. కాబట్టి మిత్రులారా, ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ మధ్య ముఖ్యమైన బేధాలు.మీరు ఇంకా తెలుసుకోవలసినది, కాబట్టి మిత్రులారా, ఇవీ ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ కీ తేడాలు. ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ మార్కెట్లు ఎలా పని చేస్తాయో మరింత తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉందా? ఈ అంశంపై మా ఇతర పాడ్‌కాస్ట్‌లను చూడండి లేదా మరింత తెలుసుకోవడానికి www.angelone.in ని సందర్శించండి. తదుపరి పోడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు, ఏంజెల్ బ్రోకింగ్ నుండి వీడ్కోలు, మరియు హ్యాపీ ఇన్వెస్టింగ్! పెట్టుబడులు మరియు సెక్యూరిటీ మార్కెట్లు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. ​ ​ ​