Exploring some of the Upcoming Share Market Trends

Podcast Duration: 8:29
రాబోతున్న షేర్ మార్కెట్ ట్రెండ్స్‌లో కొన్ని అన్వేషించడం ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ఈ రోజు ప్రోడ్ క్యాస్ట్ లో మనం అప్ కమింగ్ షేర్ మార్కెట్ ట్రెండ్స్ గురించి చర్చిద్దాం. స్టాక్ మార్కెట్ కదలికల గురించి ఎలాంతే ప్రత్యేకతలు హామీలు ఇవ్వబడవు. తెలివైన ఇన్వెస్టర్లు ఓవరాల్ ట్రెండ్స్ ను గమనిస్తూ, తమకు కావలసిన స్టాక్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ రూపొందించుకుంటారు. ట్రేడర్స్ తన బై లేదా సెల్ నిర్ణయాలు తీసుకునే విషయంలో ధరల ప్రిడిక్షన్ ప్రధాన ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వివిధ కారణాల వల్ల ప్రభావితమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ మహమ్మారి, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మరెన్నో అంశాలు మార్కెట్ పోకడలను నియంత్రిస్తూ ఉంటాయి. పోతే, ప్రస్తుతం ఏఏ ట్రెండ్స్ ఆధారంగా మీరు ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకో వచ్చు? ఏ అప్ కమింగ్ ట్రెండ్స్ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకుందాం రండి: ​ఇప్పుడు మనం ఆన్ గోయింగ్ ట్రెండ్స్ ను గమనిస్తూ అవి అప్ కమింగ్ ట్రెండ్స్ గా ఎలా రూపాంతరం చెందుతున్నాయో చూద్దాం. ఆన్ గోయింగ్ ట్రెండ్స్ ​నంబర్ 1: టీకాకు సంబంధించిన ఊహలు, ఇవి ఫార్మా కంపనీ స్టాక్స్ పైన దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పడిపోతున్నప్పటికీ ఇన్వెస్టర్లు వీటి పైన పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నాడు, దాంతో ఫార్మా స్టాక్స్ ఫ్లెవర్ ఆఫ్ ద డే గా మారాయి. ఇన్వెస్తాలు కేవలం టీకా మందు తయారు చేసే కంపనీలలోనే పెట్టుబడి పెట్టడం కాకుండా మొత్తం ఫార్మా సెక్టార్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. పలువురు నిపుణులు కూడా ముందుకు వచ్చి ఫార్మా షేర్లు సమర్థవంతమైన పెట్టుబడి ఎంపికగా పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెలలో అనేక మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీ స్టాక్స్ 15 % నుండి 36%.పెరుగుదలను నమోదు చేశాయి. అయితే ఇది అప్వర్డ్ ట్రెండ్ కు గ్యారంటీ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ మార్కెట్ నమ్మకాలు మరియు సంప్రదాయాలకు లోబడి ఉంటుంది. ఇందులో మనం సమయానుకూలంగా మార్పులను గమనించ వచ్చు. ​ఆన్ గోయింగ్ ట్రెండ్ 2: దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ బుల్లిష్ మార్కెట్.గతంలో స్టాక్ ధరలు పడిపోవడం మొదలుపెట్టినపుడు, విపరీతమైన ఆందోళన నెలకొనేది; ఫలితంగా ఇన్వెస్టర్లు తమ స్టాక్ ను విచ్చలవిడిగా అమ్మేసే వారు. దాంతో షేర్ ధరలు విపరీతంగా పడిపోయేవి. కానీ 2020 లో పరిస్థితి తిరగబడింది, ఇన్వెస్టర్లను చైతన్యపరిచేందుకు మేము అందజేస్తున్న కార్యక్రమాలు కావచ్చు లేదా ఇతరుల కార్యక్రమాలు కావచ్చు ఈ ట్రెండ్ లో మార్పు తీసుకు వచ్చాయి. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది – నేటి పేతుబడిదారులు తమ భయాన్ని జయించి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత విపరీత పరిస్తితులో కూడా జనం స్టాక్ మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పడుతున్నారు. స్టాక్ ధరలు మార్జినల్ గా పడిన వెంటనే ఇన్వెస్టర్లు కొనుగోలు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు, దాంతో షేర్ల ధరలు స్తిరంగా ఉంటున్నాయి. 2020 లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి వార్తను వినిన వెంటనే ఇన్వెస్టర్లు భయపడినంతగా మార్కెట్లో విపరీతాలు ఏమీ జరగలేదు. ​మరి ముందు ముందు ఏం జరగనుంది? అనివార్యమైన దాన్ని మనం వాయిదా వేస్తున్నామా? ఆ విషయం గురించి మనం “పొటెన్షియల్ ఫార్ ఆ ప్రైస్ కరెక్షన్” ఇన్ అప్ కమింగ్ ట్రెండ్స్ అన్న సెక్షన్ లో చర్చిద్దాం. ​దానికంటే ముందు మనం ఈ చివరి ఆన్ గోయింగ్ ట్రెండ్ నంబర్ 3 గురించి చూద్దాం: చమురు ధరల్లో పెరుగుదల – మీరు మీ స్టాక్ మార్కెట్ బెరింగ్స్ గురించి మాట్లాడుతున్నపుడు వీటికి వాటికి సంబంధం ఏమిటబ్బా? అని ఆలోచిస్తున్నారా? కానీ అదే సమయంలో – చముడు ధరలు ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మీకు తెలిసే ఉంటుంది. దీన్నే మనం ఆల్-పర్వెసివ్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. అంటే లాక్ డౌన్ మీ ఉద్యోగాలను, మీ వ్యాయామాన్ని, మీ ఆహార నియమాలను, మే సామాజిక స్థితిగతులను, మీ వినోదాలను ఇలా - అన్నింటినీ ప్రభావితం చేసినట్లు అన్నమాట. చమురు ధరలు రవాణా వ్యవస్థను ప్రభావితం చేస్తాయి, దాంతో ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమవుతుంది. (దాని ప్రభావం ట్యూరిజం పైన కూడా పడుతుంది కానీ 2020 నుండి అది కూడా గడ్డు రోజులనే ఎదుర్కొంటూ ఉంది) ముడి చమురు ధరలు పెరిగినట్లయితే, ముడి సరుకులు మరియు ఇతర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. దాంతో ఖర్చులు పెరిగి లాభాలు తగ్గిపోవడం జరుగుతుంది. దాంతో కంపెనీ యొక్క బాటమ్ లైన్ అంతా ఆకర్షణీయంగా కనిపించదు, దాని ప్రభావం స్టాక్ ధర పైన పడుతుంది. ముడి చమురును తమ ఉత్పత్తిలో లేదా బేస్ గా ఉపయోగించే వివిధ రకాల ఉత్పత్తులను మీరు గమనించవచ్చు. మనం వాడే రంగుల తయారీలో ఉపయోగించే ప్రధాన మైన పదార్థం ముడి చమురు అన్న విషయం మీకు తెలుసా? జూట్ ప్రొడక్షన్ లో ముడి చమురు ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా? టైర్ల పరిశ్రమలో కూడా ముడి చమురు ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఉపయోగించే ఇంధన వనరులన్నింటికీ మూలం ముడి చమురే - ముడి చమురు ధరలలో స్వల్ప పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్స్ అప్ కమింగ్ ట్రెండ్స్ గా ఎలా కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఆఫ్ కోర్స్ మిత్రులారా, అప్ కమింగ్ ట్రెండ్స్ అన్నవి మనం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా మనం రాబోయే ట్రెండ్స్ గురించి ఊహించుకో వచ్చు, ముందస్తు అంచనాకు రావచ్చు. అయితే మీరు ఏదైనా ఒక దృఢమైన చర్య తీసుకోవడానికి ముందు అవి పనిచేయడం ప్రాంభించనివ్వండి. ​1. ధర దిద్దుబాటుకు సంభావ్యత. పెట్టుబడిదారులు జాగ్రత్త వహించాలని కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు అదేవిధంగా చాలామండి లో-రిస్క్ పెట్టుబడిదారులు కూడా నిజంగా సఫర్ అవుతున్న ఆర్థిక వ్యవస్థ లో కూడా బుల్లిష్‌గా ఉన్న మార్కెట్ గురించి జాగ్రత్త పడుతున్నారు. దీని వనక ఉన్న లాజిక్ ఏమిటంటే, మార్కెట్ ఏదో ఒక సమయంలో కరెక్షన్ కు గురయ్యే అయ్యే అవకాశం ఉంది లేదంటే, స్టాక్ ధారాలన్నీ ప్రస్తుతం బాగా పెరిగి ఉన్నాయి, అవి ఏదో ఒక సమయంలో తప్పకుండా పడిపోయే అవకాశం ఉంది. ​దానికి తోడు పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా – మనం ఇదివరకు చర్చించుకున్నట్లుగా - స్టాక్ ధరలపైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రీఫేరెన్స్ ఉన్న చాలా మండి ఇన్వెస్టర్లు, గ్రోత్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ని ఆధారంగా చేసుకొని వ్యాల్యూ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ వైపు మొగ్గు చూపుతారు. ​2. IPO సమృద్ధి; రాబోయే నెలల కోసం ఇప్పటికే 30 దాకా IPOలు అనౌన్స్ చేయబడి ఉన్నాయి. ప్రజల నుండి నిధులను సేకరించదాంకి ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ నిర్వహించడం జరుగుతుంది – సాధారణంగా సీడ్ క్యాపిటల్ ఎక్స్పాణ్షన్ కొరకు మరియు కొత్త మార్కెట్లను విస్తరించడం కొరకు ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుంది. ఇది నిరంతరం గా కొనసాగే ట్రెండ్. నిజనైకి 2020లో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కూడ్ ఆశ్చర్యకరంగా 19 IPO లు విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా రెండు బిలియన్ డాలర్ల నిధుల సేకరణ జరిగింది. ​ IPOలలో ఇన్వెస్ట్ చేసే సమయంలో ఆ కంపనీల గురించిన స్టాక్ ప్రైస్ హిస్టరీ కూరించి ఎక్కువ వివరాలు ఇన్వెస్టర్లకు లభించవు. కకాపోతే ఒక కంపనీ షేర్లను ఇక ముందు ఎన్నడూ చూడని తక్కువ ధరకు కొనే అవకాశం ఇన్వెస్టర్లకు లభిస్తుంది. ఆ షేర్లు మార్కెట్ లోకి వెళ్ళడం అంటూ జరిగేక ఇక ధరలు పెరుగుతూనే ఉంటాయి. ​3. ఏంజిల్ బ్రోకింగ్ వంటి ఫిన్ టెక్ ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థలు ఇప్పుడు ఇన్వెస్టర్లకు యాప్ ఆధారంగా అతి సులభంగా స్టాక్ మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నాయి. దీని ద్వారా ఇన్వెస్టర్లకు షేర్ మార్కెట్ యాక్సెస్ చెయ్యడం ఇదివరకు ఎన్నడూ లేనంత అనుకూలం మరియు సులభతరం అయిపోయింది. ఇందులో ట్రేడర్లు తమ పని సులభతరం చేసుకోవడానికి ఆల్గరితంస్ ను ఉపయోగించ వచ్చు. అన్ని స్టాక్‌లను మాన్యువల్‌గా అధ్యయనం చేయడానికి బదులుగా, తగినంత డేటా ఇవ్వడం ద్వారా మైగ్రేన్ ఇవ్వడం జరుతుంది. కాస్తంత టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఇన్వెస్టర్లు తమ ఫోన్లలో ఆల్గరితం సెట్ చేసుకోవచ్చు, దాని ద్వారా ఏ స్టాక్ ఎప్పుడు కోనాలి, ఎప్పుడు అమ్మాలి అన్న అంశాలకు సంబంధించిన క్లూ పొందవచ్చు. ​టెక్ బ్యాక్ గ్రౌండ్లేని ఇన్వెస్టర్ల కొరకు కూడా పరిష్కారం ఉంది, వారు కొన్ని సూచనలను నమోదు చేయుయడం ద్వారా మరియు నేటి అధునాతన ఫిన్‌టెక్ పరిష్కారాల ద్వారా అల్గోరిథం సృష్టించుకో వచ్చు. నిజానికి ఫిన్ టెక్ సోల్యూషన్స్ ద్వారా ట్రేడింగ్ లో కూడా కొంతమేరకు ప్రజాస్వామ్యం వచ్చింది. ఇప్పుడు మీ వయసు, మీరు చేస్తున్న పని, స్టాక్ మార్కెట్ అనుభవం వంటివి ఏవీ అవసరం లేకుండా ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్య వచ్చు. కాకపోతే ఇటువంటి ప్రోడ్ క్యాస్ట్ లు విని మీరు కొంత రీసర్చ్ చేసుకోవలసి ఉంటుంది. స్పేర్ క్యాపిటల్ నుండి మాత్రమే ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ మీరు సులభంగా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి.. ​