ట్వీజర్ టాప్ & బాటమ్ కొవ్వొత్తి నమూనా: అవి ఏమిటి?

1 min read
by Angel One

స్టాక్ మార్కెట్  ట్రేడింగ్‌లో చాలా గణించిన నిర్ణయాలు ఉంటాయి, ముఖ్యంగా మీరు ఇంట్రా-డే పెట్టుబడిదారు అయితే. మీరు అనేక సాంకేతిక చార్టులను చూడాలి మరియు మీ పెట్టుబడులను విశ్లేషించాలి. ఇవన్నీ హెచ్చుతగ్గుల మార్కెట్‌తో ముడిపడి ఉన్న మీ లాభాలను బుక్ చేసుకునే అవకాశాలను పెంచడానికి మరియు రిస్క్ తగ్గించడానికి. వృత్తిపరమైన ట్రేడర్లు అధునాతన కొవ్వొత్తి నమూనాలపై ఆధారపడతారు, ఇవి అనేక ఆటోమేటెడ్ ట్రేడింగ్ అల్గోరిథంలలో కూడా విస్తృతంగా ఉపయోగించబడతాయి. కొవ్వొత్తి చార్టింగ్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది – ప్రత్యేకంగా, ట్వీజర్ టాప్ అండ్ బాటమ్ కొవ్వొత్తి నమూనాలు.

ట్వీజర్ నమూనాలు – ఒక పరిచయం

ట్వీజర్ నమూనా ఒకే రకమైన అధిక లేదా అల్ప వైవిధ్యాలతో రెండు కొవ్వొత్తిలను కలిగి ఉన్న కేవలం చిన్న ధోరణి తిరోగమనం నమూనా. ఈ కొవ్వొత్తి నమూనాలో, కొవ్వొత్తిలు ఆకారానికి విరుద్ధంగా, అధికాలు మరియు అల్పాలు చాలా ముఖ్యమైన కారకాలకు కారణమవుతాయి. స్టాక్‌లను విశ్లేషించేటప్పుడు ధోరణి తిరోగమనం అయ్యే అవకాశాన్ని సూచిస్తాయి. విస్తృత మార్కెట్ విశ్లేషణ సందర్భంలో ధోరణి సంకేతాలను అందించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. 

ట్వీజర్ టాప్ నమూనా ఏమిటి?

ట్వీజర్ టాప్ కొవ్వొత్తి నమూనా రెండు కొవ్వొత్తిలు కలిగి ఉన్న బేరిష్ తిరోగమనం నమూనాగా నిర్వచించబడింది. ఇది ఆకుపచ్చ కొవ్వొత్తితో మొదలవుతుంది, ఇది స్టాక్ పైకి వెళ్లే ధోరణిని చూసిన మొదటి రోజున కనిపిస్తుంది. రెండవ రోజు కూడా అధికంగా తెరుచుకుంటుంది, ఇది మొదటి రోజుతో దాదాపు సమానమైన అధికంగా ఉంటుంది.

ట్వీజర్ టాప్స్ గుర్తించడానికి ప్రమాణాలు

ట్వీజర్ టాప్స్ ను గుర్తించడానికి మూడు అంశాలు సహాయపడతాయి, వీటితో సహా

  1. స్టాక్ మార్కెట్, ఇప్పటికే ఉన్న పైకి వెళ్లే ధోరణినిలో ఉండటం
  2. మొదటి రోజున గమనించిన దృడ మైన ఆకుపచ్చ బాడీ
  3. రెండవ రోజు ఎర్రటి బాడీ ఏర్పడటం, ఇది మునుపటి రోజుతో దాదాపు సమానమైన అధికంగా ఉండటం

ట్వీజర్ టాప్ నమూనాల పఠనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

రెండవ కొవ్వొత్తి యొక్క అధికం, ఒక నిరోధక ప్రాంతాన్ని సూచిస్తుంది. బుల్స్, ధరను పైకి నెట్టివేసినట్లు అనిపించినప్పటికీ, వారు అత్యధిక రేట్ల కంటే ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. దీని ఫలితంగా బేర్స్ కార్యరంగంలోనికి చొచ్చుకు వచ్చేలా , గొప్ప శక్తితో తిరిగి రావడానికి మరియు ధరను తగ్గించటానికి దారితీస్తుంది. అంతేకాకుండా, ఒకేలాంటి ఎత్తుతో ఉన్న అత్యధిక కొవ్వొత్తిలు ప్రతిఘటన యొక్క బలాన్ని ప్రదర్శిస్తాయి, ఇది పైకి వెళ్లే ధోరణిని ఆపుట లేదా తిరోగమనం మరియు కిందకు పడే ధోరణి ఏర్పరుస్తుందని సూచిస్తుంది. ధోరణి తిరోగమనం సాధారణంగా మూడవ రోజు బేరిష్ రివర్సల్ కొవ్వొత్తిలును సృష్టించినప్పుడు ధృవీకరించబడుతుంది.

ట్వీజర్ బాటమ్ నమూనా ఏమిటి?

ట్వీజర్ బాటమ్ నమూనా బుల్లిష్ తిరోగమన నమూనాను సూచిస్తుంది. ఈ కొవ్వొత్తి నమూనాలో, మొదటి రోజు ఎరుపు కొవ్వొత్తి ద్వారా గుర్తించబడింది, ఆవేళ కిందకు పడే ధోరణి పురోగతిలో ఉంది. అలాగే, రెండవ రోజు మునుపటి రోజు మాదిరిగానే అల్పంగా కనిపిస్తుంది.

ట్వీజర్ బాటమ్‌లను గుర్తించే ప్రమాణాలు

ట్వీజర్ బాటమ్‌లను గుర్తించడంలో సహాయపడే మూడు అంశాలు: వీటితో సహా

  1. స్టాక్ మార్కెట్, ఇప్పటికే ఉన్న కిందకు పడే ధోరణిలో ఉండటం
  2. మొదటి రోజున గమనించిన దృడమైన ఎర్రటి బాడీ
  3. రెండవ రోజున ఆకుపచ్చ బాడీ ఏర్పడటం, ఇది మునుపటి రోజుతో దాదాపు సమానమైన అల్పంగా ఉండటం

ట్వీజర్ బాటమ్ పఠనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

రెండవ కొవ్వొత్తి యొక్క అల్పం, మద్దతు ప్రాంతాన్ని సూచిస్తుంది. అలాగే, బేర్స్ ధరను తగ్గిస్తూనే, తక్కువ ధర కంటే తక్కువకు అమ్మకాన్ని చేయడానికి వారు ఇష్టపడరు. తత్ఫలితంగా, బుల్స్ కార్యరంగంలోకి అడుగులు వేస్తాయి మరియు ధరను పైకి నడిపించడానికి గొప్ప శక్తితో తిరిగి వస్తాయి. రెండు కొవ్వొత్తిలు యొక్క ఒకేలా వున్న అల్పం, మద్దతు బలాన్ని ప్రదర్శిస్తుంది, ఇది కిందకు పడే ధోరణి తిరోగమనం లేదా ఆగుతుందని సూచిస్తుంది. మూడవ రోజు బుల్లిష్ తిరోగమనం కొవ్వొత్తి నిర్మాణం ధోరణి తిరోగమనం అయ్యిందనే విషయాన్ని నిర్ధారిస్తుంది.

ముగింపు

రెండూ, ట్వీజర్ టాప్ అండ్ బాటమ్ కొవ్వొత్తి నమూనాలు సాధారణంగా వివిధ రూపాల్లో కనిపిస్తాయి కాని కొన్ని సాధారణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి సాధారణంగా మార్కెట్-టర్నింగ్ పాయింట్ల వద్ద కనిపిస్తాయి. ఈ నమూనాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు స్టాక్ ట్రేడింగ్‌లో నైపుణ్యాన్ని పొందడానికి, ఏంజెల్ బ్రోకింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.