స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మీ సంపదను పెంచుకోవడానికి ఒక ప్రాచుర్యమైన మార్గంగా పరిగణించబడుతుంది. సరైన మార్గదర్శకత్వంతో, మీరు గణనీయమైన లాభాలను సంపాదించవచ్చు మరియు మీ కోసం ఒక గణనీయమైన ఆర్థిక పోర్ట్‌ఫోలియోను సృష్టించవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాభాలను సంపాదించడం గురించి మాత్రమే కాదు; సరైన స్టాక్స్ ఎంచుకోవడానికి మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా ప్రారంభించాలో అని ఆలోచిస్తూ ఉంటే, ఎవరిని అడగాలో తెలియకపోతే, మేము మీకు సహాయపడతాం.

ఖచ్చితంగా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం కొన్ని రిస్కులతో కూడుకున్నది, కానీ ప్రయోజనాలు రిస్కులను అధిగమిస్తాయి. చివరికి, మీరు షేర్ మార్కెట్ల ప్రపంచాన్ని మరియు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మీ సమయం వెచ్చించినందుకు సంతోషిస్తారు.   

స్టాక్ ట్రేడింగ్ అంటే ఏమిటి?

స్టాక్ ట్రేడింగ్ అంటే జాతీయ ఆర్ధిక ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన కంపెనీ స్టాక్స్ కొనుగోలు మరియు అమ్మకాన్ని సూచిస్తుంది. ఒక కంపెనీ పబ్లిక్ గా వెళ్లినప్పుడు, అది దాని షేర్లను బహిరంగంగా అమ్మకానికి జాబితా చేస్తుంది. ఈ స్టాక్స్ కొనుగోలు చేసే లేదా అమ్మే వ్యక్తులు స్టాక్ ట్రేడర్స్ గా సూచించబడతారు. వారు మార్కెట్ పరిజ్ఞానం కలిగి ఉంటారు, ఏమి జరుగుతుందో మరియు డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది తెలిసి ఉంటారు. మార్కెట్లను ఎలా టైమ్ చేయాలనే దానిపై సరైన జ్ఞానం మరియు రిస్క్ కోసం సుముఖతతో, ఎవరైనా స్టాక్స్ ట్రేడింగ్ లో పాల్గొనవచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడులను ఎలా ప్రారంభించాలో అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు మీతో ప్రారంభమవుతుంది.

మీరు ఏ రకమైన పెట్టుబడిదారులు? 

మీరు మీ షేర్ మార్కెట్ పెట్టుబడులు మరియు ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు, మీరు ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి – మీరు ఎలాంటి పెట్టుబడిదారులు? మీరు అధిక లాభాల కోసం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టాలను తగ్గించడానికి ఇష్టపడుతున్నారా? మీరు తెలివిగా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా మరియు మీ డబ్బును నిర్వహించాలనుకుంటున్నారా లేదా నిపుణులు మీ డబ్బును మీ కోసం పెట్టుబడి పెట్టడానికి మీకు సంతోషమేనా?

షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభికులకు మంచి ఆలోచనా?

ఈ ప్రశ్నకు చాలా ఖచ్చితమైన సమాధానం “అవును”. ప్రారంభికులతో సహా ప్రతి ఒక్కరూ షేర్ మార్కెట్ పెట్టుబడులను ఒకసారి ప్రయత్నించాలి. కానీ మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు, కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు షేర్ మార్కెట్ కొన్ని హెచ్చు తగ్గులకు  గురైనప్పటికీ మీరు సౌకర్యవంతంగా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగలరా అని చూసుకోండి.

ఒక ప్రారంభికుడిగా, మీ వద్ద వివిధ సాధనాలు మరియు వనరులు ఉన్నాయి, ఇవి షేర్ మార్కెట్ ప్రపంచంలో ప్రారంభించడానికి మీకు సహాయపడతాయి. అయితే, వాటిని ఎంతవరకు, ఎలా ఉపయోగించాలో పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభించడంలో మీకు సహాయపడటానికి, మొదటిసారిగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ప్రారంభికుడిగా మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలను మేము జాబితా చేసాము.

షేర్ మార్కెట్ పెట్టుబడులను ఎలా ప్రారంబించడానికి మీరు ఏమి తెలుసుకోవాలి?

భారతీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం విషయంలో, మీరు ప్రారంభించడానికి ముందు ఒక ప్రణాళికను కలిగి ఉండటం మంచిది. మీ ట్రేడింగ్ ఒక విజయవంతమైన ప్రారంభం కోసం కొన్ని జాగ్రత్త అంశాలు ఇక్కడ ఉన్నాయి. 

 1. మీ మిగిలి ఉన్న అప్పులను తీర్చివేయండి: ముందుజాగ్రత్తగా, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు, మీరు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు మొదలైన అధిక-వడ్డీ బాకీలను తీర్చివేయాలని మేము సలహా ఇస్తున్నాము.
 2. మిగులు నిధులను మాత్రమే పెట్టుబడి పెట్టండి: తెలివైన పెట్టుబడిదారులు అనుసరించే మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే వారు మిగులు ఉన్న నిధులను మాత్రమే పెట్టుబడి పెడతారు. స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఎన్నడూ డబ్బు అప్పు తీసుకోకండి మరియు మీరు మీ ఇతర ఆర్థిక అవసరాల కోసం పక్కన పెట్టిన డబ్బు కూడా తీసుకోవద్దు. నష్టాలు లేదా రాబడులకు హామీలు లేనందున మీరు చేతిలో ఉన్న అదనపు ఆదాయాన్ని మాత్రమే పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
 3. కొంత డబ్బును పక్కన పెట్టండి: ఆకస్మిక ప్రణాళికగా, అత్యవసర పరిస్థితుల కోసం ఎల్లప్పుడూ కొంత నగదును కేటాయించండి. మీరు మీ డబ్బు అంతా స్టాక్ మార్కెట్ ట్రేడ్స్ లో పెట్టుబడి పెడితే, అత్యవసర పరిస్థితి తలెత్తితే మీరే ఇబ్బందికరమైన స్థితిలో ఉంటారు.

షేర్ మార్కెట్ పెట్టుబడులను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి, ఒక నిపుణుడైన ట్రేడర్ గా మారడానికి మీరు అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.   

 1. లక్ష్యాలను నిర్దేశించుకోండి: మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు, అంతిమ లక్ష్యం ఎందుకు మరియు ఏమి కావాలి అనేది నిర్ణయించుకోండి. మీకు దీర్ఘకాలిక మూలధన పెరుగుదల కావాలా మరియు అధిక రాబడిని సంపాదించాలనుకుంటున్నారా? మీరు డివిడెండ్ రూపంలో అదనపు ఆదాయ వనరులను పొందాలనుకుంటున్నారా? మీరు షేర్ మార్కెట్లో మీ చేతిని ప్రయత్నించాలనుకుంటున్నారా మరియు మీకు బాగా ఉత్తమమైనది ఏమిటో చూడాలనుకుంటున్నారా? మీ పెట్టుబడి యొక్క లక్ష్యం ఏమిటో నిర్వచించడం వలన, మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి మరియు ఎంతకాలం మీరు పెట్టుబడి పెట్టాలి అనేదాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
 2. ఒక ప్రణాళిక కలిగి ఉండండి: ఒకసారి మీరు మీ పెట్టుబడి లక్ష్యాలను నిర్వచించిన తర్వాత, ఆ పెట్టుబడులను పనిచేయడానికి ఒక వ్యూహాన్ని సృష్టించాలి. మీ ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారంగా మీరు ఏకమొత్తం పెట్టుబడులు చేయాలనుకుంటున్నారా లేదా చిన్న సాధారణ నెలవారీ పెట్టుబడి చేయాలనుకుంటున్నారా అని నిర్ణయించండి. మీరు గణనీయమైన మొత్తాలతో నేరుగా ప్రారంభించవలసిన అవసరం లేదు. మీరు ఒక చిన్న మొత్తంతో ప్రయోగాలు చేయవచ్చు మరియు క్రమంగా దానిని పెంచుకోవచ్చు.
 3. వివరంగా తెలుసుకోండి : ఒక నిపుణుడైన ట్రేడర్ గా మారడానికి అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి దానికి  సరిపడే జ్ఞానం. మీ హోమ్‌వర్క్ చేయండి, స్టాక్ మార్కెట్ గురించి చదవండి, మీరు పెట్టుబడి పెట్టాలనుకునే కంపెనీల పై మీ పరిశోధనను చేయండి, వాటి పనితీరు నివేదికలను తనిఖీ చేయండి మరియు వార్తల కథనాలు, విధానాల మార్పులు మరియు వార్తా లేఖల కోసం ఒక కన్ను వేసి ఉంచండి. మీకు ఇష్టమైన స్టాక్‌లపై మీరు మరింత పరిశోధన చేస్తే, మీ నిర్ణయాలు మెరుగ్గా చేస్తుంది.
 4. మీ ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవండి: షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా ప్రారంభించాలో చదివిన తరువాత, వాస్తవంగా దీన్ని చేయాల్సిన సమయం వచ్చింది. మీరు మీ పెట్టుబడులను నిర్వహించడానికి బ్రోకర్ కలిగి ఉండవచ్చు లేదా మీరే బాధ్యత వహించే ట్రేడింగ్ అకౌంట్ సృష్టించవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్ వద్ద, మేము మీకు రెండింటినీ అందిస్తున్నాము. మీ అకౌంట్ ను మాతో తెరిచి, లోతైన షేర్ మార్కెట్ పరిశోధన, పనితీరు నివేదికలు మరియు మీరు ట్రేడింగ్ చేయడానికి మరియు నిపుణుడైన స్టాక్ బ్రోకర్ లాగా పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన అన్నిటికీ ప్రాప్యత పొందండి.
 5. ఒక బడ్జెట్ ఏర్పాటు చేయండి: మీ షేర్ మార్కెట్ పెట్టుబడులను ప్రారంభించడం యొక్క ఉత్సాహం తరచుగా మీకు సౌకర్యవంతమైన దాని కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి దారి తీస్తుంది. మీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి కోసం ఒక బడ్జెట్ను పక్కన పెట్టండి. మీరు రోజూ ట్రేడింగ్ చేసేటప్పుడు బడ్జెట్కు కట్టుబడి ఉండేలాగా నిర్ధారించుకోండి.
 6. మీ పరిశోధన చేయండి: స్టాక్ పెట్టుబడులు చాలా మందికి పనిచేయడానికి ఒక ప్రాథమిక కారణం వారు సమాచారాన్ని అంచనా వేయడం. మీకు ఇష్టమైన స్టాక్‌లను అనుసరించడమే కాకుండా, ఆర్థిక మార్కెట్ పోకడలను విస్తృతంగా అధ్యయనం చేయండి. వివిధ రంగాలు మరియు కమోడిటీస్లో ఏమి జరుగుతుందో దానికి మీరు అనుగుణంగా ఉండాలి. ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండండి, అంతర్జాతీయ వార్తలు మరియు భౌగోళిక రాజకీయ సంఘటనలతో అనుసందానంగా ఉండండి. ఈ రోజుల్లో, చాలా మంది పెట్టుబడిదారులు ఆన్‌లైన్ ఆర్ధిక వేదికలపై కూడా చురుకైన చర్చలు జరుపుతున్నారు; మీరు కూడా వీటిలో భాగం కావచ్చు. అయితే, మీరు చేరడానికి ముందు వేదిక యొక్క లక్ష్యాన్ని పూర్తిగా పరిశోధించాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. 
 7. మీ కోసం ఏది పనిచేస్తుందో తెలుసుకోండి:  – షేర్ మార్కెట్ యొక్క పని గురించి క్రమం తప్పకుండా చదవండి. మీకు ఆసక్తి ఉన్న కంపెనీల చెక్‌లిస్ట్‌ను ఉంచుకోండి మరియు వాటి పనితీరును నిర్ణయించడానికి వారి స్టాక్‌లను చూడండి. మీరు మరింత ఎక్కువగా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు, మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుతూ, మీకు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో మీరు తెలుసుకుంటారు. మీ పెట్టుబడి నుండి గరిష్ట లాభం పొందే కొత్త పద్ధతులను తెలుసుకోవడం మరియు ప్రయత్నించడం అనేది ఈ ఉపాయం.
 8. తార్కికంగా ఉండండి, ఉద్వేగభరితంగా ఉండకండి:  మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు, మీరు స్పష్టమైన బుర్రతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఒక వేగవంతమైన వాతావరణం, ఇక్కడ విషయాలు నిరంతరం మారుతూ, క్లిష్ట పరిస్థితులలో, మీరు భావోద్వేగాలకు బదులుగా తార్కిక నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిపుణుడైన ట్రేడర్ అయినా ట్రేడింగ్ యొక్క మొదటి నియమం మీ హృదయంతో కాకుండా మీ బుర్రని ఉపయోగించాలని మీకు చెప్తారు.
 9. క్రమం తప్పకుండా మూల్యాంకన చేయండిక్రమం తప్పకుండా మూల్యాంకనం చేయండి- ఇప్పటికే, మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా ప్రారంభించాలో ప్రావీణ్యులు. కానీ షేర్ మార్కెట్లు చాలా అస్థిరంగా ఉన్నాయని మరియు పరిస్థితి ఒక రోజు నుండి మరొక రోజుకు వేగంగా మారగలదని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా అంచనా వేయడం మంచి పద్ధతి. త్రైమాసిక, నెలవారీ మరియు అర్ధ-వార్షిక నివేదికలను తనిఖీ చేయండి, మీకు  అనుకూలంగా ఎందుకు పనిచేయలేదో అర్థం చేసుకోండి. ప్రశ్నలు అడగండి మరియు అవకాశాలు తీసుకోండి. స్టాక్ ట్రేడింగ్ నుండి మరింత పొందటానికి ఏకైక మార్గం తప్పులు చేయడం మరియు వాటి నుండి నేర్చుకోవడం.

భారతదేశంలో స్టాక్ బ్రోకర్ల రకాలు

భారతదేశంలో ముఖ్యంగా రెండు ప్రధాన రకాల స్టాక్ బ్రోకర్లు ఉన్నారు – పూర్తి-సేవా బ్రోకర్లు మరియు డిస్కౌంట్ బ్రోకర్లు.

పూర్తి-సేవా బ్రోకర్లు అనేవారు షేర్ల కొనుగోలు మరియు అమ్మకం, పెట్టుబడి సలహా, ఆర్థిక ప్రణాళిక, పోర్ట్‌ఫోలియో నవీకరణలు, షేర్ మార్కెట్ పరిశోధన మరియు విశ్లేషణ, పదవీ విరమణ మరియు పన్ను ప్రణాళిక మరియు మరెన్నో వివిధ సేవలను అందించే సాంప్రదాయక బ్రోకర్లు. ఈ బ్రోకర్లు మీ అవసరాలు మరియు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సిఫార్సులతో వ్యక్తిగతీకరించిన పెట్టుబడి సేవలను అందిస్తారు. 1987 వ సంవత్సరంలో స్థాపించబడిన, ఏంజెల్ బ్రోకింగ్ భారతదేశం యొక్క అతిపెద్ద మరియు ప్రముఖ పూర్తి-సేవా రిటైల్ బ్రోకర్లలో ఒకటి.

పరిశ్రమలోని రెండవ రకం బ్రోకర్లు డిస్కౌంట్ బ్రోకర్లు. నో-ఫ్రిల్ స్టాక్ బ్రోకింగ్ అకౌంట్లను అందించే ఆన్లైన్ బ్రోకర్లు వీరు. వారు వారి క్లయింట్‌కు వ్యక్తిగతీకరించిన సేవలను అందించరు. అవసరమైన ట్రేడింగ్ సదుపాయాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడానికి వారు ప్రసిద్ధి. డిస్కౌంట్ బ్రోకర్ ఎంచుకోవడం ద్వారా, మీరు తక్కువ బ్రోకరేజ్ ఖర్చులతో మీ ట్రేడ్లను నియంత్రించవచ్చు.

కాబట్టి, మీ కోసం సరైన బ్రోకర్ ను ఎలా నిర్ణయిస్తారు?

షేర్ మార్కెట్‌లో మీ మొదటి ట్రేడ్ చేయడం ఎంత ముఖ్యమో  మీ కోసం సరైన బ్రోకర్‌ను ఎన్నుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. మీరు నిర్ణయించే ముందు, ప్రతి రకమైన బ్రోకర్ మీకు ఇచ్చే సమర్పణలను సమీక్షించండి మరియు వాటిని మీ అవసరాలకు మరియు ప్రయోజనాలకు సరిపోల్చండి. ఆఫర్ పై ఛార్జీలు మరియు అకౌంట్ల రకాన్ని సరిపోల్చండి. మీరు పరిశోధన చేయడం మరియు పరిశ్రమలో ట్రేడింగ్ చేయడానికి బ్రోకర్ యొక్క ఖ్యాతిని అర్థం చేసుకోవడం కూడా మంచి ఆలోచన. మరియు అంతకంటే ఎక్కువగా, భారతదేశంలో మరియు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక మార్కెట్‌తో సమాన స్థాయిలో బ్రోకర్ ఉన్నడా. మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే, సరైన బ్రోకర్ను ఎంచుకోవడం సులభం మరియు వేగవంతం. 

మీ షేర్ మార్కెట్ పెట్టుబడులతో ప్రారంభించడం యొక్క ప్రాధమికలు ఇప్పుడు మీకు తెలుసు, పెట్టుబడులు పెట్టడం ప్రారంభించి, మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి దగ్గరగా ఉండండి. షేర్ మార్కెట్ నుండి సంపాదించిన లాభాలు ద్వితీయ ఆదాయానికి గొప్ప వనరుగా ఉంటాయి. ఇల్లు కొనడం, కారు కొనడం, ఉన్నత విద్య, విదేశాలకు వెళ్లడం లేదా మీరు నెరవేర్చాలనుకునే ఏ ఇతర కలలకైనా మీరు దానిని మీ నిధిలో చేర్చవచ్చు. కాబట్టి, దీర్ఘకాలిక మెరుగైన రాబడిని ఇవ్వడానికి ఈ రోజు ప్రారంభించండి. తాజాగా ఉండటాన్ని గుర్తుంచుకోండి, మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా అంచనా వేయండి మరియు ఎప్పుడు బయటకు రావాలో తెలుసుకోండి. మీరు ఈ చిట్కాలలో  ప్రావీణ్యం పొందినప్పుడు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టె కళ చాలా నిపుణులైన ట్రేడర్స్ చేసినంత త్వరగా మీకు వస్తుంది.

మార్గంలో ఉన్న అన్ని ప్రాథమిక అంశాలతో, మీరు ఇప్పుడు ఒక ప్రవీణుడైన స్టాక్ మార్కెట్ ట్రేడర్ కావడానికి మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. మాతో మీ ట్రేడింగ్ అకౌంట్ తెరవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. తప్పులేని ట్రేడింగ్ లావాదేవీలు, నిపుణుల సలహా మరియు పరిశ్రమ పరిజ్ఞానం మీ కోసం వేచి ఉంది. ఈ రోజు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి ఆ మొదటి అడుగు వేయండి. సంతోషంగా పెట్టుబడి పెట్టండి!