డోజి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్: అర్ధం & వాటి రకాలు

1 min read
by Angel One

డోజి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మరియు దానితో ట్రేడ్ చేయడం ఎలాగ అర్థం చేసుకోండి

మార్కెట్ పరిస్థితిలో కొనుగోలు పోకడలు బలంగా ఉన్నాయి అనుకోండి, కానీ కొంత మంది ట్రేడర్లు ఈ పోకడలు రివర్స్ అవ్వవచ్చు అని ఊహిస్తారు; అందువల్ల వారు అమ్ముతారు. ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది? అందరు ట్రేడర్లు అమ్మకం జోరుగా సాగిస్తే, మార్కెట్ పడిపోతుంది. కానీ ఇది తగినంత బలమైనది కాకపోతే, మార్కెట్ సందేహాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రేడర్లు ఇటువంటి మార్కెట్ పోకడలు ఎప్పుడు మారతాయా అనే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఒక చార్ట్ ను చూసి అది ఎప్పుడు జరుగుతుందో మీరు ఎలా తెలుసుకుంటారు? అయితే, సాంకేతిక ట్రేడర్లు ట్రేడింగ్ చార్ట్ లో డోజి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కోసం చూస్తారు.

డోజి క్యాండిల్ స్టిక్స్ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ కుటుంబానికి చెందినవి. ఇది దాని ప్రత్యేకమైన ఏర్పాటు నుండి దాని పేరును పొందింది, ఇది సందేహాన్ని సూచిస్తుంది. డోజి క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి  ప్రయత్నిద్దాము మరియు మనం అటువంటిది ఒకటి చూసినప్పుడు మనం ఏమి చేయాలి.

క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి?

క్యాండిల్‌స్టిక్ చార్ట్స్ అనేవి రైస్ వ్యాపారుల ద్వారా 17 వ శతాబ్దంలో జపాన్‌లో ఆవిష్కరించబడిన ట్రేడింగ్ సూచికల ప్రత్యేక రూపం. వారు ఈ ప్యాటర్న్‌లను ధర కదలికను ఊహించి ట్రేడ్ చేయడం కొరకు ఉపయోగించారు. ఆధునిక ట్రేడర్లు వివిధ క్యాండిల్ స్టిక్స్ ఉపయోగిస్తారు, అందులో డోజి ఒకటి. జపనీస్ లో, డోజి అనగా తప్పు లేదా పొరబాటు అని అర్థం. ఇది తరచుగా ఒక అప్ట్రెండ్ లేదా డౌన్ట్రెండ్ సమయంలో కనిపిస్తుంది, బుల్లిష్ మరియు బేరిష్ పోకడల మధ్య సమానతను సూచిస్తుంది.

మీరు దాన్ని చూసినప్పుడు అది ఒక డోజి క్యాండిల్‌స్టిక్ అని మీరు ఎలా గుర్తిస్తారు? అయితే, ఇది క్రాస్ లేదా స్టార్ లాగా కనిపిస్తుంది, అందువల్ల దీని పేరు, డోజి స్టార్.

డోజి మరియు ఇతర క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ మధ్య వ్యత్యాసం అది నిజమైన శరీరాన్ని కలిగి ఉండదు. ప్రారంభ మరియు చివరి విలువలు ఒకే విధంగా ఉంటాయి, వివిధ అధిక మరియు తక్కువ స్థాయిలతో. చాలా ఎక్కువ మరియు చాలా తక్కువ నీడలు ఉన్న ఒక పెద్ద కాలుతో ఉన్న డోజి, “రిక్షా మనిషి” అని పిలుస్తారు.

అప్ట్రెండ్ లేదా డౌన్ట్రెండ్ సమయంలో ఒక డోజి తరచుగా ఏర్పడిన కారణంగా, అది ఒక ట్రెండ్ రివర్సల్ యొక్క సాధ్యమైన సూచనగా పరిగణించబడుతుంది.

డోజి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రకాలు

ఒక ప్రత్యేక లక్షణాలు మరియు అవగాహనతో డోజి క్యాండిల్‌స్టిక్ అనేక రూపాలను తీసుకోవచ్చు. వాటిని ఒక్కొక్కటి చర్చిద్దాము.

డోజి స్టార్ – ఇది అదే ఓపెనింగ్ మరియు క్లోజింగ్ విలువలతో ఒక స్టార్ లాగా కనిపిస్తుంది, మరియు సమానమైన పై గీత పొడవు మరియు కింద గీత పొడవు కలిగి ఉంటుంది. మార్కెట్ సెంటిమెంట్ ను ఇటు అటు తిప్పడానికి సరిపోనటువంటి బుల్లిష్ లేదా బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది..

పెద్ద కాలు ఉన్న డోజిపై పొడవు గీత కింద పొడవు గీత చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఒక డోజి స్టార్. ఇది చాలా ఎక్కువ అస్థిరతతో సందిగ్ధమయిన సెంటిమెంట్ ను సూచిస్తుంది.

డ్రాగన్‌ఫ్లై డోజిమీరు దీనిని డౌన్‌ట్రెండ్ దిగువన కనుగొనవచ్చు, తక్కువ ధర కోసం మార్కెట్ తిరస్కరణను చూపుతుంది. డోజి స్టార్ మరియు పెద్ద కాలు ఉన్న డోజి లాగా కాకుండా, డ్రాగన్ ఫ్లై మార్కెట్ సందిగ్ధాన్ని వర్ణించదు. అందుకు బదులుగా, ఇది పైకి వెళ్ళే అప్‌వర్డ్ ట్రెండ్ రివర్సల్‌కు సంకేతం కల్పిస్తుంది. దాని ప్రత్యేక రూపం ద్వారా దానిని గుర్తించవచ్చు, నిజమైన శరీరం ఉండదు మరియు కింద గీత పొడవుగా ఉండును.

గ్రేవ్‌స్టోన్ డోజిడ్రాగన్‌ఫ్లై డోజి యొక్క ఇతర వైపున గ్రేవ్‌స్టోన్ డోజి ఉంది. అప్ట్రెండ్ సమయంలో ఇది కనిపిస్తుంది, అధిక ధర కోసం మార్కెట్ తిరస్కరణను చూపుతుంది. ఇది నిజమైన శరీరం లేకుండా మరియు పై నీడ పొడిగించబడిన ఒక డోజి క్యాండిల్‌.

4-ధర దోజి – ఇది ఒకే ఒక్క సమాంతర లైన్ ద్వారా ప్రాతినిధ్యం వహించబడుతుంది, మార్కెట్లో తీర్మానమైన సంకోచాన్ని వర్ణిస్తుంది. ప్రారంభ ధర, ముగింపు ధర, అధిక ధర మరియు తక్కువ ధర అన్నీ ఒకటే అయినప్పుడు ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది.

ఒక డోజి క్యాండిల్ నుండి ఏమి ఊహించాలి

క్యాండిల్స్టిక్ చార్ట్ లో ఒక డోజి కనిపిస్తే ఏమి చేయాలి? మీరు ఒక కొత్త ట్రేడర్ అయినా లేదా అనుభవం కలిగి ఉన్నా, మార్కెట్ సంకోచ సమయంలో వైఖరి తీసుకోవడం కష్టం. కానీ జ్ఞానంతో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం బహుశా తప్పులు చేయకుండా ఉండటానికి మీరు ఎంచుకునే ఉత్తమ రక్షణ. డోజి, ట్రెండ్ నిష్పక్షపాతమైనది, అంటే అది ఏ ట్రెండ్ రివర్సల్ ను సూచించదు. కానీ చార్ట్ నుండి ఇతర క్యాండిల్స్ తో ఒక డోజి ట్రెండ్ లో మార్పును నిర్ధారించవచ్చు.

ప్రతి క్యాండిల్ నాలుగు భాగాలను కలిగి ఉంటుంది, అనగా, ఒక ప్రారంభ మరియు ముగింపు ధర, మరియు రోజు అధిక మరియు రోజు తక్కువ ధర. దానిని చూడడం ద్వారా మీకు ఆస్తి యొక్క ధర కదలిక గురించి ఒక ఆలోచన ఏర్పడుతుంది. ప్రారంభ మరియు ముగింపు ధరలు కలిసి ఒక మందమైన విభాగాన్ని సృష్టిస్తాయి, దానినే శరీరం అని అంటారు. ప్రారంభం మరియు ముగింపు ధరల మధ్య వ్యత్యాసం ఎంత ఎక్కువగా ఉంటే, క్యాండిల్ యొక్క శరీరం అంత పొడవుగా ఉంటుంది. రెండు వైపులా, స్టాక్ యొక్క అత్యధిక మరియు తక్కువ ధరలు నీడలు సృష్టింపబడతాయి.

చాలా మంది సాంకేతిక ట్రేడర్లు డోజి క్యాండిల్ ని ఒక ట్రెండ్ రివర్సల్ సూచనగా అర్థం చేసుకున్నారు, కాబట్టి వారు మరింత ఒప్పించే నమూనాలు కనిపించేవరకు ‘ ఆగడం మరియు తరువాత స్పందించడం’ ఎంచుకున్నారు. ఉదాహరణకు, ఒక అప్ట్రెండ్ సమయంలో ఒక డోజి క్యాండిల్స్టిక్ కనిపిస్తే, కొనుగోలు యొక్క ఊపు తగ్గుతుందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది క్షణమాత్ర సంకోచం కూడా కావచ్చు, మరియు తరువాత మార్కెట్ అదే దిశలో కొనసాగించవచ్చు. కాబట్టి, మీరు ఒకే డోజి ప్యాటర్న్ ఆధారంగా మీ వ్యూహాన్ని ప్లాన్ చేస్తే, అది తప్పు అవ్వవచ్చు.

డోజి క్యాండిల్ వర్సెస్ స్పిన్నింగ్ టాప్

ఇప్పుడు, డోజి మరియు స్పిన్నింగ్ టాప్స్ రెండూ ఒకేలాంటివి మరియు మార్కెట్ సంకోచాన్ని సూచిస్తాయి. క్యాండిల్ యొక్క నిజమైన శరీరం దాని మొత్తం పరిమాణంలో 5 శాతం ఉంటే, దానిని డోజి అని పిలుస్తారు; లేకపోతే, ఒక స్పిన్నింగ్ టాప్. ట్రేడింగ్ చార్ట్ లో కనిపించేటప్పుడు, ప్రవేశాన్ని ప్లాన్ చేయడానికి లేదా నిష్క్రమించడానికి ముందు బోలింగర్ బ్యాండ్లు వంటి ఇతర సూచికల కోసం చూడండి.

ముగింపు

మార్కెట్లో శబ్దాన్ని తగ్గించడానికి మరియు ధర కదలికను అర్థం చేసుకోవడానికి సాంకేతిక ట్రేడర్లు క్యాండిల్స్టిక్ చార్ట్స్ ను ఉపయోగిస్తారు. అయితే, ఇతర సాధనాలు లాగా, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ మార్పుకు సూచన కలిగి ఉండవు. అదేవిధంగా, డోజికి దాని పరిమితి ఉంది. డోజి క్యాండిల్ ఒక్కటే చూస్తే అది నిష్పక్షపాతమైనది మరియు ట్రెండ్ రివర్స్ అవ్వవచ్చని నిర్ధారణ కాదు. డోజి ఏర్పడిన పరిమాణం, నమూనా మరియు స్థానం మారుతున్నసెంటిమెంట్ గురించి మరింత తెలియజేయవచ్చు. కొంత మంది ట్రేడర్లు డబల్ డోజి ని కనుగొంటారు, ఇది ట్రెండ్ మార్పు యొక్క మరింత నమ్మదగిన సూచన.