స్టాక్ మార్కెట్లో నష్టాలను ఎలా ఎదుర్కోవాలి

1 min read
by Angel One

ఒక పాత సామెత : “మన కీర్తి ఎప్పటికీ పడకుండా ఉండడం కాదు,మనం పడిన ప్రతిసారీ పైకి లేవడం.”  ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు కూడా వర్తిస్తుంది. డబ్బును నష్టపోవడానికి స్టాక్ మార్కెట్లో ఎవరూ పెట్టుబడి పెట్టరు. కానీ నష్టాలు ట్రేడింగ్‌లో ఒక బాగం. స్టాక్ ట్రేడింగ్ కళలో ప్రావీణ్యం సంపాదించిన వారు నష్టాలను నివారించడానికి ప్రయత్నించరు కానీ వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. దీని అర్థం కొనుగోలు ధర నుండి, ధరలు 7-8% తగ్గినప్పుడు ఒక స్టాక్ అమ్మడం. ఒక పెట్టుబడిదారునిగా, మీ తప్పును అంగీకరించడం మరియు నష్టానికి అమ్మడం ఎల్లప్పుడూ కష్టం. కానీ చేయి దాటిపోవడానికి ముందే మూలధన నష్టం గ్రహించి మరియు షేర్లు అమ్మడం అనేది మిగిలిన వారి నుండి ఒక విజయవంతమైన పెట్టుబడిదారుని భిన్నంగా ఉంచుతుంది. పెట్టుబడి పెట్టడంలో ప్రాథమిక పాఠాలలో ఒకటి స్టాక్ మార్కెట్లో నష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం.

స్టాక్ ట్రేడింగ్ లో నష్టాల రకాలు:

స్టాక్ మార్కెట్లో నష్టాలు తక్షణం మరియు స్పష్టంగా ఉంటాయి లేదా తక్కువ స్పష్టంగా మరియు సూక్ష్మంగా ఉంటాయి. వీటిని మూడు తరగతులుగా వర్గీకరించవచ్చు:

మూలధన నష్టంమూలధన నష్టం అనేది అది కొనుగోలు చేయబడిన మొత్తం కంటే తక్కువ ధరకి ఆస్తి విక్రయించినప్పుడు కలిగే నష్టం. స్టాక్ మార్కెట్లో, మీరు దాని కొనుగోలు ధర కంటే తక్కువకు  స్టాక్ అమ్మడం నుండి డబ్బును పోగొట్టుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ధరలు పడిపోతున్నప్పుడు మీరు స్టాక్ ని పట్టుకుని ఉంచుకోవచ్చు, కానీ అది మరిన్ని నష్టాలకు దారితీయవచ్చు. మీరు అసలు డబ్బును కోల్పోయినప్పుడు మూలధ నష్టం అంటారు. ఇది స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక మూలధన నష్టంగా విభజించబడవచ్చు మరియు పన్ను ప్రయోజనాల కోసం మూలధన లాభాలకు వ్యతిరేకంగా ఈ నష్టం జమ చేయవచ్చు.

అవకాశ నష్టం ఇది సరైన ధర మరియు వాస్తవమైన ధర చెల్లింపుల మధ్య వ్యత్యాసం. ఉదాహరణకు, మీరు ఒక స్టాక్‌ను రూ. 10,000 కు కొనుగోలు చేస్తే, అది ఒక సంవత్సరం చివరిలో చిన్న మార్జిన్ ద్వారా పెరిగింది లేదా అదే స్థాయిలో ఉంది అనుకోండి, అప్పుడు మీరు డబ్బును కోల్పోలేదని అనుకోవచ్చు. అయితే, వాస్తవానికి, మీరు వేరే చోట ఈ రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ సంపాదించే అవకాశాన్ని కోల్పోయారు. అందువల్ల అవకాశ నష్టం ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోకపోవడం వల్ల కలిగే నష్టం.

తప్పిపోయిన లాభం అనబడే నష్టం – చాలామంది పెట్టుబడిదారులు ఒక స్టాక్ యొక్క ఇదే ఉత్తమ ధర లేదా ఇదే దిగువ ధర అని చెప్పలేరు. ఫలితంగా, పెట్టుబడిదారులు ధరలు పెరుగుతున్నప్పుడు షేర్లను పట్టుకుని ఉంచుకుంటారు మరియు అవి పడిపోతాయని ముందుగా గ్రహించలేరు. ఇది ఎక్కువగా పడిపోయే ముందు గణనీయంగా పెరిగే అస్థిర స్టాక్స్ తో జరుగుతుంది. కొందరు పెట్టుబడిదారులు షేర్లు కోలుకుంటాయనే ఆశతో పతనం తర్వాత కూడా గట్టిగా పట్టుకుని ఉంచుకుంటారు. అయితే, అది ఎల్లప్పుడూ జరగకపోవచ్చు. మంచి పద్ధతి ఏమిటంటే చిన్న లాభంతో సంతృప్తి పడడం.

స్టాక్ మార్కెట్లో నష్టాలను ఎలా ఎదుర్కోవాలి?

స్టాక్ మార్కెట్లో నష్టాలను ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం వాటిని తగ్గించడం. విజయవంతమైన ట్రేడర్లు నష్టం నుండి నేర్చుకున్న పాఠాలను ఉపయోగించి, బలంగా మరియు మరింత క్రమశిక్షణతో ఉంటారు. స్టాక్ మార్కెట్లో నష్టాలను ఎలా డీల్ చేయాలి అనే దానిపై ఈ క్రింది కొన్ని దశలు ఉన్నాయి:

బాధ్యతను అంగీకరించండిఒకసారి మీరు నష్టపోయిన తర్వాత, దానిని దాచవద్దు లేదా దానినుండి పారిపోవద్దు. మీ నష్టాలకు యాజమాన్యం తీసుకోవడం అనేది మీ పెట్టుబడులపై నియంత్రణకోసం తీసుకునే మొదటి అడుగు.

నష్టాన్ని దృక్పథంలో ఉంచండి – ఒక నష్టం, అది ఎంత పెద్దది అయినప్పటికీ మిమ్మల్ని నిర్వచించలేదు. మీ ట్రేడింగ్ కంటే మీరు పోషించవలసిన పాత్రలు ఎక్కువ ఉన్నాయి. మీ దృక్పథాన్ని సరిగ్గా ఉంచుకోండి మరియు ఆటకు తిరిగి రండి.

మీ ఎంపికలను విశ్లేషించండిమీరు చేసిన ఎంపికలను సమీక్షించండి మరియు మీరు భిన్నంగా ఏదైనా చేయగలరా అని తనిఖీ చేయండి. కొంతమంది ట్రేడర్లు మంచి అవకాశం కోసం వేచి ఉంటారు; మరికొందరు మంచి మార్కెట్ పరిస్థితులలో తమ ట్రేడ్ తో తిప్పికొడ్తారు. వారు చేసిన నష్టాలను తిరిగి పొందడమే కాక, లాభాల వైపు కూడా కదులుతారు.

ప్రణాళిక సరైన ఎంపికలు చేసుకోవడం అనుభవం మీకు నేర్పిస్తుంది. మీ నష్టాలు, మీరు ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో మీకు చూపుతాయి. మళ్ళీ మార్కెట్లో దూకే ముందు మీ భవిష్యత్తు ప్రయత్నాల కోసం ఒక వివరణాత్మక  ప్రణాళిక రూపోందించండి.

ప్రేరణ పొందండిమీ నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి, నష్టాన్ని ప్రేరణగా ఉపయోగించండి. భవిష్యత్తులో మెరుగుపరచడానికి మీ బలహీనతను ఉత్ప్రేరకంగా ఉపయోగించండి.

ముగింపు:

మీరు చేసిన నష్టాల నుండి మీరు భావోద్వేగపరంగా మరియు ఆర్థికంగా కోలుకున్న తర్వాత, ఆటకు తిరిగి రండి. వ్యాపారంలో నష్టాలను నివారించడం సాధ్యం కాదు, కానీ చురుకైన పెట్టుబడిదారులు సరైన చర్యలను తీసుకుంటారు మరియు నష్టాలను తగ్గించుకుంటారు.