లిమిట్ ఆర్డర్ అంటే ఏమిటి మరియు అది ఎలా ఉపయోగించబడుతుంది?

ఇతని పేరు రవి. ఇతను లిమిట్ ఆర్డర్ గురించి మరియు అది ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆశీష్, అతని స్నేహితుడు మరియు ఏంజెల్ బ్రోకింగ్ తో అనుభవం ఉన్న పెట్టుబడిదారుడు ఇలా వివరిస్తున్నారు:

ఉదాహరణకు లక్ష్మీ టెక్సటైల్స్ షేర్లు ప్రతి షేరు నూటయాభై రూపాయల వద్ద ట్రేడ్ చేస్తున్నాయని అనుకోండి. మీరు కంపెనీలో షేర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు కానీ మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. కనుక మీరు కొనదలచుకున్న ధర అయిన నూటఇరవైఐదు రూపాయల వద్ద ఆర్డర్ సెట్ చేశారు. ఆ షేర్ యొక్క మార్కెట్ విలువ 125 రూపాయలకు పడితే, మీ విశ్వసనీయ బ్రోకర్ అయిన ఏంజెల్ బ్రోకింగ్ మీ కోసం లక్ష్మీ టెక్స్టైల్స్ షేర్లను కొనుగోలు చేస్తారు.

అదేవిధంగా, మీరు లక్ష్మీ టెక్స్టైల్స్ షేర్లను కలిగి ఉంటే, మీరు ఒక ధర వద్ద ఆర్డర్ సెట్ చేయవచ్చు, ఉదాహరణకు మీరు మీ షేర్లను 175 రూపాయలు వద్ద విక్రయించాలని అనుకోవచ్చు. షేర్ల మార్కెట్ విలువ 175 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా పెరిగిన వెంటనే, మీ బ్రోకర్ మీ షేర్లను విక్రయిస్తారు. ఒకవేళ మార్కెట్ విలువ 175 రూపాయల కంటే తక్కువ ఉంటే అతను షేర్లను తన దగ్గరే ఉంచుకుంటాడు. అందువల్ల మీరు స్టాక్ కొనుగోలు చేసే ధరను మరియు విక్రయించే ధరను నియంత్రించడానికి లిమిట్ ఆర్డర్లు సహాయపడతాయి. రవి ఇప్పుడు లిమిట్ ఆర్డర్ ఏమిటో మరియు దానిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకున్నాడు.