భారతదేశంలో బ్రోకరేజ్ ఛార్జీలు

1 min read
by Angel One

బ్రోకరేజ్ మరియు బ్రోకరేజ్ ఛార్జీలు అనే పదాలతో మనకు అందరికీ పరిచయం ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ పై లావాదేవీలను అమలు చేయడానికి క్లయింట్ పై బ్రోకర్ విధించే ఛార్జీ అది. విధించబడే బ్రోకరేజ్ అనేది బ్రోకర్ ఆదాయం యొక్క ప్రధాన వనరు. అందువలన, మీరు ఎక్కువ పరిమాణాలను ఇస్తే తక్కువ బ్రోకరేజ్ మరియు మీరు అధిక పరిమాణాలను ఇస్తే తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలను బ్రోకర్స్ వసూలు చేస్తారు

నా ట్రేడింగ్ అకౌంట్‍కు బ్రోకరేజ్ ఎందుకు వసూలు చేయబడుతుంది?

మీ వర్తకాలను అమలు చేయడం, మీ లావాదేవీలను సెటిల్ చేయడం, మీకు ట్రేడింగ్ మరియు పెట్టుబడి ఆలోచనలను ఇవ్వడం వంటి సేవలను ఎవరైనా బ్రోకర్ మీకు అందిస్తారు. కస్టమర్లకు సర్వీస్ అందించడానికి, బ్రోకర్ కార్యాలయం, సిబ్బంది మరియు కంప్యూటర్లను నిర్వహించాలి.

ఈ అన్ని ఖర్చులను కవర్ చేయడం కోసమే బ్రోకర్ బ్రోకరేజ్ వసూలు చేస్తారు. అది బ్రోకర్ యొక్క ఆదాయం వనరు.

అప్పుడు బ్రోకర్ నా నుండి ఎస్‍టిటి మరియు జిఎస్‍టి కూడా కాంట్రాక్ట్ నోట్లో ఎందుకు వసూలు చేస్తారు?

  1. జిఎస్‍టి, ఎస్‍టిటి మరియు స్టాంప్ డ్యూటీ బ్రోకర్ ఆదాయం కాదు.
  2. బ్రోకర్ మీ తరపున ఈ ఛార్జీలను సేకరించడం మాత్రమే చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
  3. జిఎస్‍టి, ఎస్‍టిటి మరియు స్టాంప్ డ్యూటీ వంటి పన్నులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించబడతాయి మరియు అది వారికి ఆదాయం.

బ్రోకర్లు వారి క్లయింట్లు అందరి నుండి అదే బ్రోకరేజ్ వసూలు చేస్తారా?

బ్రోకర్ కు ఒక సూచనాత్మక బ్రోకరేజ్ రేటు ఉంటుంది. మీ వాస్తవ బ్రోకరేజ్ అనేది బ్రోకర్ తో మీకు గల సంబంధం మరియు మీ ద్వారా ఎంత పరిమాణంలో వర్తకం చేయబడుతోంది అనేదాని ఆధారంగా విధించబడుతుంది.

నా బ్రోకర్ ఈక్విటీ కోసం అధిక బ్రోకరేజ్ మరియు ఫ్యూచర్స్ కోసం తక్కువ బ్రోకరేజ్ ఎందుకు వసూలు చేస్తున్నారు?

అది ఎందుకంటే ఈక్విటీలు వాస్తవ విలువలపై వర్తకం చేస్తాయి మరియు ఫ్యూచర్స్ ఊహాత్మక విలువపై వర్తకం చేస్తాయి కాబట్టి.

మీరు టాటా మోటార్ల యొక్క 1500 షేర్లను రూ.400 కు కొనుగోలు చేస్తే, అది క్యాష్ మార్కెట్లో మీకు రూ.600,000 ఖర్చు అవుతుంది. అయితే, ఫ్యూచర్స్ మార్కెట్లో, మీరు ఎంతో 20% మార్జిన్ మాత్రమే చెల్లిస్తారు. అందువల్ల రూ.120,000 పై బ్రోకరేజ్  ఊహాపరమైన విలువ (.6 లక్షలు) పరంగా వ్యక్తం చేయబడినప్పుడు, ఫ్యూచర్స్ పై బ్రోకరేజ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నట్లు  అనిపిస్తుంది.

నా ఖాతాలో బ్రోకరేజ్ రేటును ఎవరు నిర్ణయిస్తారు?

మీరు మీ బ్రోకర్ తో సంతకం చేసే క్లయింట్ ఒప్పందం ఈక్విటీలు, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్‍లు కోసం నిర్దిష్ట బ్రోకరేజ్ రేట్లను స్పష్టంగా పేర్కొంటుంది.

బ్రోకరేజ్ రేట్లలో ఏదైనా మార్పు బ్రోకర్ మీకు ముందుగానే తెలియజేస్తారు.

మీరు బ్రోకరేజ్ రేట్లలో మార్పు కోసం అడగవచ్చా?

మీ వాస్తవ ట్రేడింగ్ పరిమాణాలు మీరు అసలు ఊహించిన దాని కంటే ఎక్కువగా పరిణమిస్తే మరియు మీరు ఓవర్ ఛార్జ్ చేయబడుతున్నారని మీరు భావిస్తే, మీరు తక్కువ బ్రోకరేజ్ కోసం మీ బ్రోకర్ తో బేరసారాలు జరపవచ్చు.

నేను వింటూ ఉండే ప్రతి లాట్ చొప్పున బ్రోకరేజీల భావన ఏమిటి?

ప్రతి లాట్ కు, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్‍లు విషయంలో బ్రోకరేజ్ ఏర్పాటు మరింత వర్తిస్తుంది. ఎఫ్ అండ్ ఓ అనేది ఎప్పటికప్పుడు నిర్వచించబడే లాట్  సైజుల్లో వర్తకం చేయబడుతుంది.

ఉదాహరణకు, టాటా మోటార్స్ ప్రస్తుతం రూ.400 వద్ద కోట్ చేస్తున్నారు మరియు 1500 లాట్ పరిమాణం కలిగి ఉంది. బ్రోకర్ ఈ 1 లాట్ కోసం మొత్తం బ్రోకరేజీని దాదాపుగా రూ.30/లాట్ వద్ద నిర్ణయిస్తారు. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్‍లలో బ్రోకర్ల మధ్య ఈ రకం ప్రతి లాట్ బ్రోకరేజ్ చాలా సాధారణమైనది.

కొంతమంది బ్రోకర్లు దాదాపుగా-జీరో బ్రోకరేజ్ ను ఎలా అందించగలుగుతున్నారు?

  1. డిస్కౌంట్ బ్రోకర్లు వర్తకం యొక్క స్వచ్ఛమైన అమలును మాత్రమే ఇస్తారు. వారు పరిశోధన, ట్రేడింగ్ కాల్స్ లేదా సలహా సేవలను అందించరు. వారు ప్రధానంగా నికర వ్యాపారులు కావడంతో, వారు నిలబడగలుగుతారు.
  2. ఫుల్-సర్వీస్ బ్రోకర్లు మీకు నివేదికలు, పరిశోధన, నవీకరణలు మరియు సమయానుకూల సలహాలను అందిస్తారు. అందువల్ల వారు అధిక బ్రోకరేజ్ వసూలు చేస్తారు.

అధిక బ్రోకరేజ్ మరియు హామీ ఇవ్వబడిన రాబడులతో ఒక బ్రోకర్ నన్ను సమీపించారు

  1. బ్రోకరేజ్ రేటు అనేది పూర్తిగా మీ నిర్ణయం ఎందుకంటే అధిక బ్రోకరేజ్‍కుతగిన విలువను బ్రోకర్ మీకు ఇస్తున్నారని మీరు సంతృప్తి చెందవలసి ఉంటుంది కాబట్టి.
  2. కానీ మీరు ఈక్విటీ మార్కెట్లలో హామీ ఇవ్వబడిన రాబడుల కోసం మోసపోకూడదు.
  3. గుర్తుంచుకోండి, స్టాక్ ఎక్స్చేంజ్‍లు మరియు సెబీ ఈక్విటీలలో హామీ ఇవ్వబడిన రాబడులను స్పష్టంగా నిషేధించాయి కాబట్టి అది చట్టపరంగా అనుమతించబడదు.

రెండవది, ఈక్విటీ అనేది అస్థిర సాధనాలుగా ఉండటంతో, నిజంగా రాబడులను హామీ ఇవ్వడం కష్టం. అందువల్ల అటువంటి వాగ్దానాలకు దూరంగా ఉండటం మంచిది.

నా వర్తకం పై ఛార్జ్ చేయబడుతున్న బ్రోకరేజ్ నేను ఎలా తెలుసుకోగలను?

అమలు చేయబడిన అన్నివర్తకాల కోసం మీ బ్రోకర్ రోజువారీ ప్రాతిపదికన కాంట్రాక్ట్ నోట్‍లను అందిస్తారు. ఆ కాంట్రాక్ట్ నోట్‍లు స్పష్టంగా అమలు ధర, వర్తకం విలువ, వసూలు చేయబడిన బ్రోకరేజ్ రేటు మరియు ఇతర చట్టబద్ధమైన ఛార్జీలు పేర్కొంటాయి.

బ్రోకరేజ్ ఎంపికలు – దానిని సారాంశంగా చెప్పడం:

  1. మీ బ్రోకరేజ్ రేట్లు అనేవి మీరు ఇచ్చే పరిమాణాలపై ఆధారపడి ఉంటాయి
  2. పరిమాణాల ఆధారంగా మీరు ఫిక్స్డ్ లేదా వేరియబుల్ రేట్ల బ్రోకరేజ్ కోసం ఎంచుకోవచ్చు
  3. డిస్కౌంట్ బ్రోకర్లు మరియు ఫుల్-సర్వీస్ బ్రోకర్ల మధ్య తేడా ఉంది
  4. హామీ ఇవ్వబడిన రాబడుల వ్యామోహం నివారించండి