ఐపిఓ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ వర్సస్ లిస్టింగ్ లాభాలు

1 min read
by Angel One

ఐపిఓలు లేదా ఇనీషియల్ పబ్లిక్ ఆఫెరింగ్స్, కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయడానికి కొత్తగా తీసుకువచ్చే ఇష్యూలు. ఐపిఓ సబ్‌స్క్రిప్షన్ 3 వర్గాలలో విభజించబడుతుంది దాని తరువాత మొత్తం ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ నిర్ణయించబడుతుంది. మీరు ఒక ఐపిఓ ఓవర్ సబ్ స్క్రైబ్ చేసినప్పుడు అది ఐపిఓ కోసం వాస్తవమైన డిమాండ్, సప్లై కంటే ఎక్కువగా ఉందని అర్థం. ఉదాహరణకు, ఇష్యూల పరిమాణం 10 లక్షల షేర్లు మరియు వాస్తవమైన డిమాండ్ 1 కోటి షేర్లు ఉన్నట్లయితే, అప్పుడు ఐపిఓ 10 రెట్లు అధికంగా సబ్ స్క్రైబ్ చేయబడినది అని అర్ధం. సాధారణంగా, ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ అనేది ఎక్కువగా ఉన్న పెట్టుబడిదారుల  ఆశక్తికి సంకేతం మరియు స్టాక్ యొక్క ఇష్యూ ధరపై ప్రభావితం చూపుతుంది.

ఐపిఓ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి?

  1. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ సాధారణంగా డిమాండ్ యొక్క ఒక కారకం.
  2. బలమైన బ్రాండ్ పేర్లు మరియు సహేతుకమైన విలువలు కలిగిన కంపెనీల యొక్క నాణ్యమైన ఇష్యూలు ఓవర్‌ సబ్ స్క్రైబ్ అగుటకు కీలక కారకాలు.
  3. ఒక ఐపిఓ బలమైన ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ పొందినప్పుడు మరియు సహేతుకమైన ధర కూడా ఉంటే, అప్పుడు అది స్టాక్ ఎక్స్చేంజ్ లలో మంచి లిస్టింగ్ ను ఆస్వాదించవచ్చు.

ఓవర్ సబ్స్క్రిప్షన్ అధిక లిస్టింగ్  లాభాలకు దారితీస్తుందా?

  1. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ మరియు ఐపిఓ లిస్టింగ్ ధర మధ్య ఎటువంటి స్థాపించబడిన సంబంధమూ లేదు.
  2. భారతదేశంలో ఒక ఐపిఓ కోసం లిస్టింగ్ సమయం దాదాపు 7 పని రోజులు అని మనకు తెలుసు
  3. ఈ వ్యవధిలో కేటాయింపు పూర్తవుతుంది, ఇతర చట్టబద్ధమైన దాఖలాలు చేయబడతాయి మరియు స్టాక్ లిస్టింగ్ చేయబడుతుంది
  4. ఒక మంచి లిస్టింగ్ కోసం ఓవర్‌సబ్‌స్క్రిప్షన్  ఒక కారణం అయితే, ధర మరియు లిస్టింగ్ సమయంలో మార్కెట్ పరిస్థితులు మొదలైనవి కూడా ఆధారపడి ఉంటాయి.

ఒక ఇష్యూ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది?

  1. ఒక ఇష్యూ అధికంగా సబ్స్క్రైబ్ చేయబడినప్పుడు, అది స్టాక్ కొరకు అధిక డిమాండ్ లక్షణం. అంటే మీరు షేర్లకు దరకాస్తు చేసిన వారి అందరికి పూర్తి కేటాయింపు ఇవ్వలేరు అని అర్థం.
  2. పెట్టుబడిదారుల వర్గం ఆధారంగా కేటాయింపు భిన్నంగా ఉంటుంది
    1. రిటైల్ పెట్టుబడిదారుల కోసం, వీలైనంత వరకు ఎక్కువ మంది విభిన్న దరఖాస్తుదారుల కోసం ఐపిఓ కేటాయింపును పొందేలా జరుగుతుంది.
    2. హెచ్ఎన్ఐ పెట్టుబడిదారుల విషయంలో (రూ. 2 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తు చేసేవారు), ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ కేటాయింపు నిష్పత్తి పద్దతిలో ఉంటుంది
    3. అంటే హెచ్‌ఎన్‌ఐ 10,000  షేర్లు కొరకు దరఖాస్తు చేస్తే మరియు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ 10 రెట్లు అయితే, అతను 1000  షేర్ల  కేటాయింపును పొందుతారు.
    4. సంస్థాగత క్యుబిఐ లు విషయంలో, ఐపిఓ కేటాయింపు విచక్షణాత్మక ప్రాతిపదికన చేయబడుతుంది.

ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ మరియు లిస్టింగ్ లాభాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంత సమాచారాన్ని చూడగలమా ?

ఐపిఓ పేరు ఇష్యూ ధర మార్కెట్ ధర ఓవర్ సబ్స్క్రిప్షన్ లాభం / నష్టం (%)
హెచ్డిఎఫ్సి లైఫ్ Rs. 290 Rs. 383 4.90 సార్లు 32.07%
ఖాదిమ్ ఇండియా Rs. 750 Rs. 672 1.90 సార్లు (10.41%)
న్యూ ఇండియా అస్స్యూరన్స్ Rs. 800 Rs. 553 1.19 సార్లు (30.88%)
ఎంఎఎస్ సెంట్రల్ ఫైనాన్షియల్ Rs. 459 Rs. 638 128.39 సార్లు 39.01%
మాట్రిమోనీ.కామ్ Rs. 985 Rs. 900 4.44 సార్లు (8.63%)
డిక్సన్ టెక్ Rs. 1766 Rs. 3225 117.80 సార్లు 83.00%
అపెక్స్ ఫ్రోజెన్ Rs. 175 Rs. 849 6.14 సార్లు 385.14%
కొచ్చిన్ షిప్యార్డ్ Rs. 432 Rs. 546 76.19 సార్లు 26.39%
ఎయు స్మాల్ ఫిన్ బికె. Rs. 358 Rs. 677 53.60 సార్లు 89.11%
జిటిపిఎల్  హాత్వే Rs. 170 Rs. 165 1.53 సార్లు (2.94%)

ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ మరియు లిస్టింగ్ లాభాల మధ్య సంబంధం పై కీలక పద్ధతులు క్రింద ఇవ్వబడ్డాయి. గత 6 నెలల్లో జరిగిన కొన్ని కీలక IPOలపై దృష్టి పెట్టబడినది.

  1. అతి తక్కువ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ స్థాయిలు బలహీనమైన పోస్ట్ లిస్టింగ్ ధర పనితీరుకు సంబంధించినవి అని చూడవచ్చు. జిటిపిఎల్ హాత్వే, ఖాదీమ్ మరియు న్యూ ఇండియా అస్యూరెన్స్ కేసులను తీసుకోండి. న్యూ ఇండియా అస్యూరెన్స్ పరిమాణం ద్వారా చాలా పెద్ద ఇష్యూ అయినప్పటికీ, ఈ అన్ని సందర్భాలలో విలువ సంబంధిత సమస్యల కారణంగా ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ పరిమితంగా ఉంది. ఈ 3 కేసులలో ధర-పనితీరు ప్రతికూలంగా ఉంది.
  2. గణనీయమైన ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఒక మంచి సంకేతం అయినప్పటికీ, అది లిస్టింగ్ తరువాత పనితీరుకు హామీ ఇవ్వదు. ఉదాహరణకు, డిక్సన్ టెక్ 117 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్  చేయబడింది మరియు లిస్టింగ్ చేసినప్పటి నుండి 83%  రాబడిని ఇచ్చింది, అయితే 128 సార్లు పెద్ద ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ తో ఎంఎఎస్ ఫైనాన్షియల్ లిస్టింగ్ నుండి 39%  రాబడి  మాత్రమే ఇచ్చింది. అదేవిధంగా, లిస్టింగ్ నాటి నుండి 77 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ తో కొచ్చిన్ షిప్‌యార్డ్స్ 26%  రాబడి ఇచ్చాయి.
  3. లిస్టింగ్ తరువాత రాబడి కోసం పరిమాణం ఒక సమస్య. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ 4.90 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కేవలం 32% రాబడిని మాత్రమే ఇచ్చింది, అయితే అపెక్స్ ఫుడ్స్ 6.14 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ తో  లిస్టింగ్ చేసినప్పటి నుండి నమ్మశక్యం కాని 385% రాబడిని ఇచ్చింది. ఓవర్‌సబ్‌స్క్రైబ్ పొందిన చిన్న కంపెనీలు మరింత వేగకరంగా ఉంటాయని మరియు లిస్టింగ్ తర్వాత మెరుగైన రాబడి ఇవ్వగలవు అని నిరూపిస్తాయి. 
  4. ఈ లిస్టింగ్ తరువాత పనితీరులలో చాలా బలమైన రంగాల మరియు నిర్మాణాత్మక ఆట కూడా ఉంది. ఉదాహరణకు, భీమా సంస్థలు చాలా కష్టపడ్డాయి ఎందుకంటే ఒకేసారి చాలా భీమా కంపెనీల లిస్టింగ్ లు వచ్చాయి మరియు వాటిలో చాలావరకు ఎటువంటి బెంచ్ మార్కులు లేనందువలన పూర్తిగా ధర ఉన్నట్లు కనిపిస్తాయి. సముద్రపు ఆహార రంగంలో పనిచేసే అపెక్స్ ఫుడ్స్ వంటి కంపెనీలు సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం వల్ల ప్రయోజనం పొందాయి
  5. ఒక కఠినమైన పరిశ్రమలో కూడా, వ్యక్తిగత అర్హత లెక్కించబడుతుంది. ఉదాహరణలు ఎంఎఎస్ ఫైనాన్షియల్ మరియు ఎయు స్మాల్ బ్యాంక్ వంటి స్టాక్స్, ఇవి కష్టతరమైన ఆపరేటింగ్ వాతావరణం మధ్య అధిక పోటీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ మెరుగ్గా ఉన్నాయి.

పెట్టుబడిదారులు మరియు వాటాదారులకు కీలక మార్గాలు:

  1. చాలా తక్కువ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఉన్న కంపెనీలు లిస్టింగ్ తరువాత తక్కువ పనితీరును చూపిస్తాయి.
  2. ఐపిఓ యొక్క లిస్టింగ్ తరువాత విజయం, సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం.  

చాలా ఎక్కువ మూల్యాంకనంతో కూడిన ఐపిఓలు లిస్టింగ్ తరువాత దెబ్బతినే ధోరణి కలిగి వుంటాయి.