ఆదాయ పన్ను జరిమానా

1 min read
by Angel One

ఆదాయం రిటర్న్ ఫైల్ చేసే ప్రక్రియకు మీరు భయపడుతున్నారా? ఆలస్యపు ఫైలింగ్ మరియు ఆదాయపు పన్ను జరిమానా మిమ్మల్ని గజగజలాడిస్తున్నాయా? ఆదాయపు పన్ను సీజన్ మనలో చాలా మందికి ఉక్కిరిబిక్కిరిలాడేలాగా ఉండవచ్చు. మన ఫైనాన్సులను పొందడం నుండి పేర్కొన్న పెట్టుబడుల యొక్క రుజువులను అన్వేషించడం వరకూ, ఇది మన అందరికీ ఒక ఉపయోగకరమైన సమయం. కొందరు ప్రజలు వారి ఆదాయపు పన్ను రిటర్న్స్ ను వార్షిక పని కింద ఫైల్ చేస్తున్నారు, కొంతమందికి దానికి సమయం ఉండదు, మరియు ఈ ప్రక్రియ యొక్క సంక్లిష్టతలను చాలా ద్వేషిస్తారు, వారు దానిని ఒక వృత్తిపరమైన వారికి అందిస్తారు. మీరు ఏ వర్గాలకు చెందినవారు?

సరే, మీరు ఏ వర్గంలో ఉన్నాగానీ, ఆదాయపు పన్ను దాఖలు చేయడం అనేది ప్రతి పన్ను చెల్లించే పౌరులకు తప్పనిసరి. మీరు గడువు తేదీని మిస్ అయితే, మీరు చెల్లించడానికి అర్హులైన ఆదాయపు పన్ను జరిమానా ఉంటుంది. FY 2018-19 లో, మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 2019. ప్రస్తుతం, ప్రభుత్వ అధికారుల ద్వారా పొడిగించబడితే తప్ప, ఆర్థిక సంవత్సరం 2019-20 కోసం ITR ఫైల్ చేయడానికి చివరి రోజును ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తులు గడువు తేదీ నాటికి తమ ITR సమర్పించడంలో విఫలమైతే, వారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మీరు గడువు తేదీ తర్వాత కానీ 31 డిసెంబర్ 2020 కు ముందు మీ ITR ఫైల్ చేస్తే, అప్పుడు రూ. 5000 ఆదాయ పన్ను జరిమానా మీపై విధించబడుతుంది. మీరు జనవరి 2021 మరియు మార్చి 2021 మధ్య మీ ITR ఫైల్ చేస్తే, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడం కోసం మీరు రూ. 10,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 5,00,000, కంటే తక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి మీ జరిమానా రూ. 1000

ఆదాయ పన్ను జరిమానా వివరాలు
గడువు 5 లక్షల కంటే తక్కువ ఆదాయం 5 లక్షల పైన ఆదాయం
జూలై 31, 2020 రూ 0 రూ 0
జూలై 31 నుండి డిసెంబర్ 2020 వరకు రూ. 1,000 రూ. 5,000
జనవరి 2021 నుంచి మార్చి 2021 రూ. 1,000 రూ. 10,000

కానీ మీరు ITR ఫైలింగ్ గడువును ఎందుకు మిస్ చేయకూడదు అనేదానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రింద జాబితా చేయబడినవి.

  • సవరణల కోసం తక్కువ సమయం – తమ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రజలు భయపడే అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి ఏంటంటే తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి. మరియు చిన్న తప్పు కూడా మీకు అనవసరమైన ఆందోళన మరియు ఒత్తిడికి కారణం కావచ్చు. దానికి తోడు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు ముగిసిపోవడం మరియు ఎటువంటి తప్పులు జరగలేదని మీరు రెట్టింపుగా నిర్ధారించుకోవాలి. సవరించబడిన ప్రభుత్వ నియమాల ప్రకారం, మీ ITR కు ఏవైనా మార్పులు లేదా సవరణలు చేయడానికి ఆ నిర్దిష్ట అంచనా సంవత్సరం ముగిసే వరకు మాత్రమే మీకు సమయం ఉంటుంది.

ఇంతకుముందు, తప్పులను సరిచేయడానికి మరియు ITR ను తిరిగి సమర్పించడానికి విండో 2 సంవత్సరాలు. అప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపు నుండి కేవలం 1 సంవత్సరానికి ప్రభుత్వం ఈ వ్యవధిని మార్చింది. అంటే మీరు ఎంత త్వరగా మీ ఆదాయపు పన్ను ఫైలింగ్‌ పూర్తి చేస్తే, మీరు తప్పులు చూసుకోవడానికి మరియు మీ ITR ఫైల్‌ను సరిచేయడానికి అప్లై చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఆదాయపు పన్ను జరిమానా చెల్లించవలసిన కారణం కాకుండా, తప్పుడు ITR ను తిరిగి సమర్పించవలసిన అవాంతరాన్ని నివారించడం అనేది మీరు గడువు తేదీకి ఎందుకు ప్రయత్నించాలి అనేందుకు ఒక మంచి కారణం.

  • పన్ను పై చెల్లించవలసిన వడ్డీ- మీరు ఇవ్వబడిన గడువు ముగిసిన తర్వాత మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయనప్పుడు, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి జరిమానా చెల్లించడం మాత్రమే కాక మీరు చెల్లించవలసిన పన్ను మొత్తం పై 1% వడ్డీ కూడా చెల్లించవలసి ఉంటుంది. మరియు మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఎక్కువ ఆలస్యం అయితే, మీరు చెల్లించే ఎక్కువ వడ్డీ ఉంటుంది. కాబట్టి, మరింత తెలివైన మరియు మరింత ఖర్చు-తక్కువ ఎంపిక ఏంటంటే గడువు తేదీని అనుసరించడం మరియు దానికి ముందు మీ ఆదాయ పన్ను రిటర్న్ ను సమర్పించడం.
  • వాపసు చెల్లింపుపై వడ్డీ ఏదీ లేదు- చాలా తరచుగా, అధిక పన్నులు చెల్లించిన వ్యక్తులు వారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం నుండి డబ్బు వాపసు పొందుతారు. అయితే, మీరు గడువు తేదీని మిస్ అయితే, మీరు ఆదాయపు పన్ను జరిమానా చెల్లించడం మాత్రమే కాక, మీరు ప్రభుత్వం నుండి డబ్బు వాపసు పొందే ఈ ప్రయోజనం కూడా జప్తు చేయబడుతుంది.
  • నష్టాలను ముందుకు తీసుకువెళ్ళలేరు – సాధారణంగా, మీరు మీ వ్యాపారంలో నష్టాలు జరిగినప్పుడు, మీకు తదుపరి ఆర్థిక సంవత్సరానికి నష్టాలను ముందుకు తీసుకువెళ్ళే నిబంధన ఉంటుంది. అయితే, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడంలో మీరు ఆలస్యం అయితే, భవిష్యత్తు సంవత్సరాలలో ఆదాయానికి వ్యతిరేకంగా మీ నష్టాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా మీకు అనుమతి లేదు.

2020 కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన తేదీలు

  • ఆర్థిక సంవత్సరం 2018-19 కోసం ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి గడువు తేదీ 31 మార్చి 2020. ఒకవేళ మీరు ఈ గడువు తేదీని మిస్ అయితే, మీరు అలా చేయమని ప్రభుత్వం అడిగితే మినహా ఆ తర్వాత ఆ సంవత్సరం కోసం మీ ITR సమర్పించలేరు. ITR యొక్క ఆలస్యపు ఫైలింగ్ కోసం మీరు రూ. 10,000 ఆదాయ పన్ను జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది
  • 15 జూన్ నుండి ప్రారంభించి మీ యజమానులు మరియు బ్యాంకుల నుండి TDS సర్టిఫికెట్లను సేకరించండి. ITR ఫైల్ చేయడానికి మీ యజమాని మీకు ఫారం 16 ఇవ్వాలి
  • ఆర్థిక సంవత్సరం 2019-2020 కోసం ITR ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31
  • PAN మరియు ఆధార్ కార్డులు అనుసంధానించడానికి గడువు తేదీ 31 మార్చి 2020 కు పొడిగించబడ్డాయి. మీరు ఇవ్వబడిన గడువు తేదీ నాటికి మీ PAN కార్డును మీ ఆధార్ కార్డుకు అనుసంధానించకపోతే, మీ PAN కార్డ్ పనిచేయకుండా పోతుంది.

ఈ రోజులలో, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అనేది  ఒకప్పుడు ఉన్నట్లుగా క్లిష్టమైనది కాదు. ఇ-ఫైలింగ్ సాధ్యమవడంతో, చాలా పన్ను చెల్లింపుదారులు తమ ITR ను ఫైల్ చేయడానికి ఎంచుకుంటారు. అయితే, మీకు సహాయం అవసరమైతే లేదా మీ ITR దాఖలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలో సాధ్యం కాకపోతే, నిపుణుడిని సంప్రదించడం ఉత్తమమైనది. వారు మీకు ITR ను సులభంగా ఎలా ఫైల్ చేయాలో మార్గదర్శకం చేయడమే కాకుండా ఈ ప్రక్రియ ఎందుకు ముఖ్యమైనది అనేదాని గురించి కూడా వివరిస్తారు. ప్రతి పన్ను చెల్లింపుదారు గడువు తేదీకి ముందు వారి ITR దాఖలు చేసే లక్ష్యం కలిగి ఉండాలి. ఇది ఒక అవసరమైన పని అయి ఉండవచ్చు, కానీ ఇది ఆదాయపు పన్ను జరిమానా చెల్లించవలసి రావడం కంటే లేదా మీకు అర్హత ఉన్న వాపసు చెల్లింపు పొందకుండా ఉండడం కంటే మెరుగైనది. కాబట్టి, మీ ఆదాయ పన్ను రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయండి మరియు తరువాత చట్టపరమైన అవాంతరాలతో వ్యవహరించడం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.