తక్కువ బ్రోకరేజ్ మరియు తక్కువ-ఖర్చు డిస్కౌంట్ బ్రోకరేజ్

1 min read
by Angel One

మనం తక్కువ బ్రోకరేజ్ ఛార్జీల గురించి మాట్లాడినప్పుడు మనం తక్షణమే డిస్కౌంట్ బ్రోకర్స్ గురించి ఆలోచిస్తాము. భారతదేశంలో అతి తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలు మరియు అతి తక్కువ బ్రోకరేజ్ ఫీజు గల బ్రోకర్ ఏది? కానీ ఛార్జీలు మరియు ఫీజులపై బ్రోకర్లను పోల్చడానికి ముందు, బ్రోకింగ్ ఖర్చు ఖచ్చితంగా వేటిని కవర్ చేస్తుందో అర్థం చేసుకుందామా?

మేము బ్రోకరేజ్ గురించి మాట్లాడినప్పుడు, అది ఒక విస్తృత భావంగల పదం మరియు ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

  1. అసలు బ్రోకరేజ్ ఛార్జీలు
  2. అకౌంట్ తెరవడానికి ఛార్జీలు
  3. వార్షిక నిర్వహణ చార్జీలు
  4. ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జీలు
  5. పరిశోధన మరియు ఇతర సర్వీస్ ఛార్జీలు
  6. ఇతర దాచబడిన ఛార్జీలు

మనం తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలు అర్థం చేసుకున్నప్పుడు లేదా తక్కువ బ్రోకరేజ్ ఛార్జీల గురించి మాట్లాడినప్పుడు, మనం ఒక సమగ్ర వీక్షణ చేయాలి. కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలను చూద్దాం, ఇవి పెట్టుబడిదారుల కోసం బ్రోకరేజ్ కాలిక్యులేటర్ గా కూడా పనిచేస్తాయి. గుర్తుంచుకోండి, భారతదేశంలో ట్రేడింగ్ కోసం అతి తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలు అనేవి సాధారణంగా ఆన్‍లైన్ ట్రేడింగ్‍కు మాత్రమే పరిమితం చేయబడతాయి.

తక్కువ బ్రోకరేజ్ అనేది వేటిని కలిగి ఉంటుంది అనేదానికి ప్రాక్టికల్ ఉదాహరణలు:

టైప్ A : ఈ బ్రోకర్ రూ..200 అకౌంటింగ్ తెరిచే ఛార్జ్ మరియు వార్షిక నిర్వహణ ఛార్జ్ (ఎఎంసి) రూ.300 వసూలు చేస్తారు. అయితే, బ్రోకరేజ్ రేట్లు 0.01% లేదా రూ.20, ఏది తక్కువ అయితే దాని అంత తక్కువగా ఉంటాయి.

టైప్ B: ఈ బ్రోకర్ యొక్క బ్రోకరేజ్ ఛార్జీలు టైప్ A వారికి ఉన్నట్లుగానే అకౌంట్ తెరవడం ఛార్జీ వంటివి ఉంటాయి. అయితే, ఎఎంసి చాలా తక్కువగా ఉంటుంది.

టైప్ C: ఒక అకౌంట్ తెరిచే ఛార్జ్ మరియు ఎఎంసి ఉంటుంది, కానీ ప్రతి లాట్ కు ఖార్చు రూ.9/లాట్ కు చొప్పున చాలా తక్కువగా ఉంటుంది. ఈ అన్ని ఖర్చుల కాంబినేషన్ మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీ నిఫ్టీ ట్రేడ్ యొక్క బ్రేక్-ఈవెన్ ను నిర్ణయిస్తుంది.

టైప్ D: వారు మీకు అకౌంట్ తెరవడం ఛార్జీలు లేదా వార్షిక ప్రాతిపదికన ఎఎంసి గానీ వసూలు చేయరు. ఎన్ఎస్ఇ విభాగాలు అన్నింటిపై బ్రోకరేజ్ శూన్యంగా ఉంటుంది. ఇది మనల్ని ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది; వారు డబ్బు ఎలా సంపాదిస్తారు? ఈ బ్రోకర్లు ఫ్లోట్ పై గణనీయమైన డబ్బును సంపాదిస్తారు. ఫుల్-సర్వీస్ బ్రోకర్లు లాగా కాకుండా, ఈ డిస్కౌంట్ బ్రోకర్లు ముందస్తు ఫండింగ్ లేకుండా ఏ పొజిషన్ తీసుకోవడానికి అనుమతించరు. డిస్కౌంట్ బ్రోకరేజ్ క్లయింట్లు అనేక చిన్న మరియు మధ్య తరహా క్లయింట్ల వ్యాప్తంగా విస్తరించబడి ఉండటం వలన, లిక్విడ్ ఫండ్స్ వంటి ప్రాడక్ట్స్ పై సగటుకు పైగా రాబడులను నిరంతరం సంపాదించగల ఫ్లోట్ బ్రోకర్ వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.

మీపై డిస్కౌంట్ బ్రోకర్లు విధించే దాచబడిన ఖర్చులు కూడా ఉంటాయి. ఉదాహరణకు, మీ ఇంటర్నెట్ డౌన్ అయినప్పుడు ఒక బ్యాక్-అప్ కాల్-అండ్-ట్రేడ్ సదుపాయం ఉంటుంది, దీనికి ఒక ఖర్చు ఉంటుంది. రెండవది, బ్రోకర్ నుండి ఏదైనా డాక్యుమెంట్ అభ్యర్థన మీకు చిన్న ఖర్చుగా డెబిట్ చేయబడుతుంది. మూడవగా, ఫండ్ బదిలీలు ఖర్చును కలిగి ఉంటాయి. ఎన్ఇఎఫ్టి మరియు ఆర్టిజిఎస్ ఏ ఖర్చును ఆకర్షించకపోయినప్పటికీ, పేమెంట్ గేట్వేల ద్వారా బదిలీ అనేది ప్రతి బదిలీకి రూ.10-15 ఖర్చును ఆకర్షిస్తుంది. చాలామంది డిస్కౌంట్ బ్రోకర్లు మిమ్మల్ని అదనంగా కూడా ఛార్జ్ చేస్తారు, వర్తకుడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్రాడే పొజిషన్ మూసివేయకపోతే మరియు ట్రేడింగ్ సిస్టమ్ పొజిషన్ ను మూసివేసినప్పుడు. ఇవి అన్నీ జోడిస్తే చెప్పుకోదగినంత మొత్తమే అవగలదు.

మనం తక్కువ-ఖర్చు డిస్కౌంట్ బ్రోకరేజ్ గురించి మాట్లాడినప్పుడు, గుర్తుంచుకోవలసిన 7 విషయాలు ఇక్కడ ఉన్నాయి

  1. బ్రోకింగ్ ఖర్చు అనేది బ్రోకరేజ్ గురించి మాత్రమే కాక అకౌంట్ తెరవడం ఛార్జీలు మరియు వార్షిక నిర్వహణ ఛార్జీలు వంటి ఇతర ఖర్చులను కూడా కలిగి ఉంటుంది
  2. మీరు ఈ ఖర్చులను అన్నింటినీ నమోదు చేసి ఆ తరువాత నిఫ్టీ ట్రేడ్ కోసం బ్రేక్-ఈవెన్ స్థాయిని లెక్కించడం ద్వారా డిస్కౌంట్ బ్రోకర్ ఖర్చును నిర్ణయించవలసి ఉంటుంది
  3. సర్వీస్ డెలివరీ మరియు టెక్నాలజీ పటిష్టత పై దృష్టి పెట్టండి. ఇది ఒక 100% నెట్ ఆధారిత ప్లాట్ఫార్మ్ కావడంతో పటిష్టత అనేది ఎంతో అవసరం
  4. లోపాలకు అవకాశం లేనిది మరియు మీ జేబుపై మరీ భారం అవని కాల్-అండ్-ట్రేడ్ సదుపాయం వంటి బ్యాక్అప్ సదుపాయం అందుబాటులో ఉందా అని తనిఖీ చేయండి
  5. మీకు మీరే స్వంతంగా తగినంత సునాయాసంగా వర్తకం చేయగలిగినట్లయితే డిస్కౌంట్ బ్రోకర్లు ఆదర్శవంతంగా ఉంటారు. మీరు పరిశోధన మరియు సలహా రూపంలో మద్దతు ఆసిస్తూ ఉంటే, ఫుల్-సర్వీస్ బ్రోకర్లు మీకు మరింత మెరుగ్గా సరిపోతారు
  6. ఉచిత బ్రోకరేజ్ అంటూ ఏమీ లేదు. మీకు ఏ బ్రోకరేజ్ వసూలు చేయని ఒక బ్రోకరేజ్ ఇప్పటికీ మీ ఫ్లోట్ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు మరియు మీ క్లయింట్ బేస్ గణనీయంగా విస్తరించినప్పుడు అది ఎంతో ఎక్కువగా ఉంటుంది
  7. దాచబడిన ఖర్చుల కోసం చూడండి మరియు సన్న అచ్చులో అక్షరాలను చదవండి. తరచుగా, అసలు తిరకాసు వివరంలోనే ఉంటుంది మరియు మీరు దానినే బాగా ఆలోచించాలి

మీరు బహుశా తెలిసుకోవాలి అని కూడా అనుకునే విషయాలు

భారతదేశంలో బ్రోకరేజ్ ఫీజు ఎంత?

బ్రోకర్ యొక్క స్టేటస్ మరియు అందించబడే సేవల ఆధారంగా భారతదేశంలో బ్రోకరేజ్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఒక బాల్ పార్క్ పై ఒక ఫుల్-సర్వీస్ బ్రోకింగ్ హౌస్, లావాదేవీ పరిమాణం యొక్క 0.03% – 0.60% మధ్య వసూలు చేస్తుంది.

మీ బ్రోకర్ ఒక డిస్కౌంట్ బ్రోకర్ అయితే, వారు ఇంట్రాడే ట్రేడింగ్ పై ఫ్లాట్ ఫీజు వసూలు చేయవచ్చు లేదా మీ అకౌంట్ కు స్టాక్స్ యొక్క ఉచిత జీవితకాల డెలివరీని అందించవచ్చు.

కనీస బ్రోకరేజ్ ఛార్జ్ ఎంత?

బ్రోకింగ్ హౌసుల మధ్య బ్రోకరేజ్ ఫీజు వారి స్టేటస్ మరియు అందించే సేవల శ్రేణి ఆధారంగా మారుతుంది. మీరు ఒక ఇంట్రాడే ట్రేడర్ అయితే, మీరు తరచుగా పెద్ద పరిమాణంలో లావాదేవీలు జరుపుతూ ఉంటారు కాబట్టి ప్రతి లావాదేవీకి నామమాత్రపు ఫీజు వసూలు చేసే ఒక బ్రోకింగ్ హౌస్ తో భాగస్వామ్యం చేయండి.

ఏంజెల్ బ్రోకింగ్ మార్కెట్లో అతి తక్కువ బ్రోకింగ్ ఛార్జీలలో ఒకదాన్ని అందిస్తుంది.

బ్రోకరేజ్ ఫీజు ఎలా లెక్కించబడుతుంది?

బ్రోకరేజ్ ఖర్చు అనేక భాగాలను కలిగి ఉంటుంది,

  • అసలు బ్రోకరేజ్ ఛార్జీలు
  • అకౌంట్ తెరవడానికి ఛార్జీలు
  • వార్షిక నిర్వహణ చార్జీలు
  • ఫండ్ బదిలీ ఛార్జీలు
  • పరిశోధన మరియు ఇతర సర్వీస్ ఛార్జీలు
  • ఇతర దాచబడిన ఛార్జీలు

బ్రోకర్ వసూలు చేయగల గరిష్ట బ్రోకరేజ్ ఎంత?

ఒక బ్రోకర్ తమ క్లయింట్ల నుండి వసూలు చేసే అత్యధిక బ్రోకరేజ్ ఫీజుగా బిఎస్ఇ మరియు ఎన్ఎస్ఇ 2.5 శాతం స్థిరపరచింది.

ఏంజెల్ బ్రోకింగ్ అనేది ఒక డిస్కౌంట్ బ్రోకరా?

అవును, ఏంజెల్ బ్రోకింగ్ అనేది పూర్తి శ్రేణి సేవలతో ఒక ఫుల్-సర్వీస్ డిస్కౌంట్ బ్రోకింగ్.

ఒక డిస్కౌంట్ బ్రోకర్ గా, మేము మీకు ఈక్విటీ లావాదేవీల పై అతి తక్కువ రేట్లను అందిస్తాము మరియు ఒక ఫుల్-సర్వీస్ బ్రోకర్ గా, మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రతిఫలం అందించేదిగా చేయడానికి అదనపు సేవలు అనేకం అందిస్తాము.

ఫ్యూచర్స్ కోసం బ్రోకరేజ్ ఛార్జీలు ఏమిటి?

ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. కానీ ఫ్యూచర్స్ కోసం బ్రోకరేజ్ ఫీజు ఈక్విటీ పై వసూలు చేయబడే బ్రోకరేజ్ కంటే తక్కువగా ఉంటుంది. ప్రతి లాట్ బ్రోకింగ్ ఫీజు కూడా తరచుగా వర్తింపజేయబడతాయి, ఇది ఫ్యూచర్స్ ఒప్పందాలను ఒక చవకైన ఎంపికగా చేస్తుంది.

ఫ్యూచర్స్ లావాదేవీలో ప్రతి అమలు చేయబడిన ఆర్డర్ కోసం ఏంజెల్ బ్రోకింగ్ రూ 20 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంది.

ఇంట్రడే కోసం బ్రోకరేజ్ ఛార్జీలు ఏమిటి?

రూ. 20 లేదా 0.05 శాతం, ఏది తక్కువైతే అది.

ప్రతి అమలు చేయబడిన ఆర్డర్ పై ఏంజెల్ బ్రోకింగ్ రూ 20 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంది.

డెలివరీ కోసం బ్రోకరేజ్ ఛార్జీలు ఏమిటి?

మీ   అకౌంట్‍కు ఈక్విటీలను డెలివర్ చేయడానికి బ్రోకింగ్ హౌసులు ఒక శాతం లేదా ఫ్లాట్ ఫీజు వసూలు చేయవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్ లో, మీరు జీవితకాలం ఉచిత స్టాక్స్ డెలివరీని అందుకుంటారు. 

ఆప్షన్స్ కోసం బ్రోకరేజ్ ఛార్జీలు ఏమిటి?

ఏంజెల్ బ్రోకింగ్ వద్ద, మేము ప్రతి అమలు చేయబడిన ఆర్డర్ కోసం రూ 20 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తాము.