డిమాట్ అకౌంట్‌తో ఆధార్‌ను లింక్ చేయండి

1 min read
by Angel One

ఆన్లైన్ లో డిమాట్ అకౌంట్ తెరవడం సమయంలో 

ఆన్‌లైన్‌లో ఒక డిమాట్ అకౌంట్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి దశలు

ఆన్లైన్ లో డిమాట్ అకౌంట్ తెరిచే సమయంలో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేయబడటంతో డిమాట్ అకౌంట్ తో ఆధార్ ను ఎలా లింక్ చేయాలి అనేదానిలో అనేకమంది అకౌంట్ హోల్డర్లు గందరగోళంగా ఉంటారు. ఈ క్రింది సులభమైన దశలను ఉపయోగించి మీ డిమాట్ అకౌంట్‌తో మీ ఆధార్ కార్డ్ లింక్ చేయబడవచ్చు:

 ఆన్లైన్ లో డిమాట్ అకౌంట్ నుఆధార్ తో లింక్ చేసేందుకు దశలు

దశ 1: ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ను సందర్శించండి 

దశ 2: పేజీ “డిమాట్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి” ఎంపికపై క్లిక్ చేయండి 

దశ 3: మీ డిపాజిటరీ పార్టిసిపెంట్, డిపి ఐడి, మీ క్లయింట్  ఐడి, మరియు పాన్ వివరాలు నమోదు చేయండి

దశ 4: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికు ఒక ఓటిపి పంపబడుతుంది 

దశ 5:   ఒటిపి ఎంటర్ చేయండి మరియు ప్రాసీడ్ క్లిక్ చేయండి

దశ 6: మీ ఆధార్ వివరాలు మరియు ఇతర అవసరమైన వివరాలు ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి

దశ 7:  మీ ఆధార్ తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ కు ఒక ఒటిపి పంపబడుతుంది

దశ 8:  ఒటిపి ఎంటర చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి

మీరు ఏంజెల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ హోల్డర్ అయితే, మీరు డిమాట్ అకౌంట్‌తో మీ ఆధార్‌ను లింక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

మీ డిమాట్ అకౌంట్‌తో మీ ఆధార్ కార్డును లింక్ చేస్తున్నప్పుడు అందుబాటులో ఉంచుకోవలసిన డాక్యుమెంట్ల జాబితా

  1. ఆధార్ కార్డు
  2. డిపి పేరు, డిపి ఐడి, పాన్ మరియు మీ డిమాట్ ఖాతాకు సంబంధించిన ఇతర వివరాలు
  3. ఒటిపి ని ధృవీకరించడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ అందుబాటులో ఉంచుకోవాలి

మీ ఆధార్ మీ డిమాట్ ఖాతాతో లింక్ చేయబడిందో లేదో ఎలా తెలుసుకోవాలి

క్రింద పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీ ఆధార్ మీ డిమాట్ అకౌంట్‌తో విజయవంతంగా లింక్ చేయబడిందో లేదో మీరు త్వరగా తనిఖీ చేయవచ్చు:

  1. యుఐడిఎఐ వెబ్‌సైట్‌ను సందర్శించండి
  2. ఆధార్ లింక్ చేయబడిన అకౌంట్ చెక్ చేయండి పై క్లిక్ చేయండి
  3. మీ 12-అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి
  4. మీరు మీ మొబైల్ పై ఒక ఒటిపి అందుకుంటారు, దానిని   ఒటిపి ఫీల్డ్ లో ఎంటర్ చేయండి
  5. మీరు మీ ఆధార్‌కు లింక్ చేయబడిన డిమాట్ అకౌంట్ తో సహా అన్ని అకౌంట్లను చూడగలుగుతారు

మీ డిమాట్ అకౌంట్‌తో మీ ఆధార్‌ను లింక్ చేసే ప్రయోజనాలు:

  1. డిమాట్ అకౌంట్‌తో ఆధార్‌ను లింక్ చేయడం అనేది ఫ్యూచర్స్ మరియు  ఆప్షన్స్ ట్రేడింగ్  కోసం అవసరమైన డాక్యుమెంటేషన్‌ను తగ్గిస్తుంది
  2. అన్ని వివరాలు మీ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రామాణీకరించబడినందున త్వరిత మరియు సులభమైన ఇకెవైసి ఆమోదం
  3. ఆధార్ కార్డులకు లింక్ చేయబడని డిమాట్ అకౌంట్లు సంభావ్య డియాక్టివేషన్ కు గురికావచ్చు
  4. మోసం నివారణకు రెగ్యులేటర్లకు మానిటరింగ్ సులభంగా చేయడానికి సహాయపడుతుంది