ఒక డిమాట్ అకౌంట్ ఏర్పాటు చేసిన తర్వాత, మీరు డిమాట్ అకౌంట్ ఛార్జీలను పరిగణించాలి.

తమ కస్టమర్లకు ఫ్రీ డిమాట్ అకౌంట్ అందించే అనేక బ్రోకర్లు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మరియు బ్రోకింగ్ సంస్థలు, అందించిన వివిధ ఆప్షన్ల ఆధారంగా కస్టమర్ పై కొన్ని ఛార్జీలు తర్వాతి దశలో లేదా కొంత సమయం తర్వాత విధిస్తాయి. డిమాట్ అకౌంట్ ఛార్జీల గురించి అన్ని వివరాలు తెలుసుకోవడం మీకు అవసరం.

మీరు ఎన్ఎస్‍డి‍ఎల్ లేదా సిడిఎస్ఎల్ తో అధీకృత డిపి అయి, మరియు సెబితో రిజిస్టర్ చేయబడిన ఏదైనా బ్రోకింగ్ సంస్థ, ఆర్థిక సంస్థ లేదా బ్యాంకును ఎంచుకోవచ్చు. ఈ కంపెనీల్లో ప్రతి ఒక్కటీ తమ డిమాట్ అకౌంట్ బ్రోకరేజ్ ఛార్జీలతో వస్తాయి.

డిమాట్ ఛార్జీలు :

పరిగణించవలసిన ఒక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే డిమాట్ ఛార్జీలు. వీటి సారాంశం ఇక్కడ ఉంది:

అకౌంట్ తెరవడం ఫీజు :

ఈ రోజులలో, డిపిల ద్వారా విధించబడే డిమాట్ అకౌంట్ తెరవడానికి ఛార్జీలు నామమాత్రంగా ఉంటాయి. మీరు వారితో 3- ఇన్-1 అకౌంట్, అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మరియు ఒక డిమాట్ అకౌంట్, ఏర్పాటు చేస్తే బ్యాంకులు దానిని పూర్తిగా ఉచితంగా అందిస్తాయి.

అయితే, ఏంజెల్ బ్రోకింగ్ వంటి అనేక ప్రైవేట్ బ్రోకింగ్ సంస్థలకు అకౌంట్ తెరవడానికి ఫీజు  ఉండదు మరియు వారి ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ ద్వారా మీకు ఒక అవాంతరాలులేని అకౌంట్ తెరిచే అనుభవాన్ని అందిస్తాయి. అయితే, స్టాంప్ డ్యూటీ, జిఎస్‍టి మరియు సెబి ద్వారా ఇతర చట్టబద్దమైన విధింపులు వంటి ఏవైనా అదనపు ఖర్చులు ఉంటే, అవి వర్తించే విధంగా ఛార్జ్ చేయబడతాయి.

అందువల్ల, మీరు ఎల్లప్పుడూ వివిధ డిపిలు మరియు వారి డిమాట్ అకౌంట్ తెరవడం ఛార్జీలను సరిపోల్చి మీ కోసం ఉత్తమమైనదాన్ని ఎంచుకోవాలి.

వార్షిక నిర్వహణ చార్జెస్ :

కొన్ని సంస్థలు ఒక ప్రాథమిక ఫీజు వసూలు చేస్తాయి, అయితే కొద్ది డిపిలు మొదటి సంవత్సరం ఎఎంసి ఛార్జీని కూడా వదిలి రెండవ సంవత్సరం నుండి బిల్లింగ్ సైకిల్ ప్రారంభిస్తాయి. ఛార్జీల కోసం ప్రతి డిపాజిటరీ దాని నిర్దిష్ట మార్గదర్శకాలను కలిగి ఉంటుంది.

ఉదాహరణకు, ఏంజెల్ బ్రోకింగ్ వారి ఎఎంసి ఫీజుగా సంవత్సరానికి రూ. 699 ఫ్లాట్ రేట్ వసూలు చేస్తుంది మరియు వివిధ విలువ జోడించబడిన సేవలను అందిస్తుంది, అందులో కొన్ని సర్వీసులను చెప్పాలంటే నెట్ బ్యాంకింగ్ మరియు యుపిఐ ద్వారా ఫండ్స్ యొక్క ఆన్లైన్ ట్రాన్స్ఫర్, టెక్నికల్ మరియు డెరివేటివ్స్ ట్రేడింగ్ ఆలోచనల కోసం అనలిటిక్స్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడ్వైజరీ వంటివి. 

జూన్ 1, 2019 నుండి సెబీ ప్రాథమిక సర్వీసుల డిమాట్ అకౌంట్ – బిఎస్‍డిఎ ను సవరించింది,  ఇందులో రూ. 1 లక్షల వరకు డెట్ సెక్యూరిటీల కోసం ఏ వార్షిక నిర్వహణ ఛార్జీలు లేవు. దీనికి విరుద్ధంగా, రూ. 1 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు హోల్డింగ్ ఉంటే రూ. 100 గరిష్ట మొత్తం విధించబడుతుంది.

కస్టోడియన్ ఫీజు:

డిపిలు ప్రతి సంవత్సరం లేదా పేర్కొనబడితే తప్ప ఒక ఒకసారి రుసుము వసూలు చేస్తాయి. చాలా సార్లు, ఈ ఫీజు డిపాజిటరీ, ఎన్‍డిఎస్ఎల్ లేదా సిడిఎస్ఎల్ కు గానీ,  నేరుగా కంపెనీ ద్వారా చెల్లించబడుతుంది.

ఏంజెల్ బ్రోకింగ్ వంటి బ్రోకింగ్ కంపెనీలలో చాలావరకు, కస్టడీ ఫీజులను రద్దు చేస్తాయి.

ట్రాన్సాక్షన్ ఫీజు:

డిమాట్ అకౌంట్ బ్రోకరేజ్ ఛార్జీలుగా కూడా పిలవబడే ట్రాన్సాక్షన్ ఫీజు, డిపి ద్వారా పూర్తి చేయబడిన ప్రతి లావాదేవీ కోసం ఛార్జ్ చేయబడుతుంది. కొన్ని డిపిలు లావాదేవీ విలువ యొక్క శాతం వసూలు చేస్తాయి, అయితే వేరేవి ప్రతి లావాదేవీకి ఫ్లాట్ రుసుము వసూలు చేస్తాయి.

ఏంజెల్ బ్రోకింగ్ వంటి బ్రోకింగ్ సంస్థలు ఈక్విటీ డెలివరీ ట్రేడింగ్ పై చాలా తక్కువ మొత్తం మరియు ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఒ, కరెన్సీలు మరియు కమోడిటీ కోసం రూ 20/ఆర్డర్ ఫ్లాట్ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తాయి. 

పైన పేర్కొన్న రుసుములు కాకుండా, క్రెడిట్ ఛార్జీలు, తిరస్కరించబడిన సూచన ఛార్జీలు, వివిధ పన్నులు మరియు సెస్, ఆలస్యపు చెల్లింపు రుసుములు వంటి ఇతర డిమాట్ ఖాతా ఛార్జీలు ఉంటాయి. మీ పెట్టుబడిదారు ప్రయోజనం కోసం ఒక డిపిని ఎంచుకునే ప్రక్రియలో మీరు ఉన్నప్పుడు, మీ డిమాట్ అకౌంట్ కు విధించబడే అన్ని ఛార్జీలను తప్పక చూడండి.